గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా నుంచి బయటపడ్డారు. లేటెస్టుగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్ వచ్చినట్టు ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఇవాళ(సోమవారం) తెలిపారు. కాకపోతే ఆయన ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నారన్నారు. దీనికి సంబంధించి చరణ్ ఒక వీడియో షేర్ చేశారు. నాన్నకు కరోనా నెగిటివ్‌గా వచ్చింది…అయితే ఆయన ఊపిరితితత్తుల ఇన్‌ఫెక్షన్ నయం కావడానికి మరి కొద్ది కాలం పడుతుందన్నారు. త్వరలోనే ఆయనకు వెంటిలేటర్ తీసేయాలని డాక్టర్లు భావిస్తున్నారన్నారు. ప్రస్తుతం నాన్న స్పృహలోనే ఉన్నారని తెలిపారు. తన ఐప్యాడ్‌లో ఆయన టెన్నిస్, క్రికెట్ మ్యాచ్‌లను చూస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి సెడెషన్ ఇవ్వటం లేదని .. ఫిజియో థెరపి మాత్రం కొనసాగిస్తున్నారని తెలిపారు.
ఎస్పీ బాలసుబ్రణ్యం ఆగస్టు 5న కరోనాతో చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కొన్నిరోజులకే ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఐసీయూకి తరలించి వెంటిలేటర్ అమర్చారు. తర్వాత ఆయనకు ఎక్మో సాయంతో ట్రీట్ మెంట్ చేశారు. తాజాగా ఆయనకు కరోనా నెగిటివ్ అని వచ్చింది.

