కరోనా మహమ్మారి: అప్పటిదాకా లాక్ డౌనే రక్ష

కరోనా మహమ్మారి: అప్పటిదాకా లాక్ డౌనే రక్ష

రోడ్డెక్కాలంటే కాలు గడప దాటదు. ఏది ముట్టు కోవాలన్నా చెయ్యి ముందుకు రాదు. ముడితే వైరస్ పడుతుందేమోనన్న డౌటు. పట్టుకుంటే శాని టైజర్ వైపు చేతుల చూపు. మాస్కు కోసం మొహం ఎదురుచూపులు. అంతలా ఎక్కడికక్కడ అందరినీ కట్టిపడేసింది మహమ్మారి కరోనా. దేశదేశాలను లాక్ చేసేసి కీని తన దగ్గ రపెట్టేసుకుం ది. లోకం మొత్తం తెరుచుకోవాలంటే అది పోవాలి.. అదే ప్రస్తుతం అందరి ముందున్న తాళం చెవి. మరి, ఆ కరోనా పోయెదెప్పుడు? ఈ ప్రశ్నే అందరినీ పలకరిస్తోంది ప్పుడు. దానికి ఎన్నో ఆన్సర్లు, ఆ ఆన్సర వెనక ఎన్నో అనుమానాలు, ఆందోళనలు. ఇప్పటికైతే అందరి ఆశలు సైంటిస్టులు తయారు చేస్తున్నవ్యాక్సిన్ల పైనే. మరి, అప్పటిదాకా..? ఇదిగో బ్లూమర్గ్  అనాలిసిస్ చెబుతున్న కొన్ని ఇంపార్టెంట్ విషయాలు!!!

ప్రస్తుతం మహమ్మారి అంతం అన్నది హెర్డ్ ఇమ్యూని టీపైనే ఆధారపడి ఉంది. అంటే, ప్రతి ఒక్కరికి వైరస్ తో పోరాడే శక్తిరావాలి. వైరస్ ఒంట్లోకి చేరినా, మన రోగ నిరోధక వ్యవస్థ చేతుల్లో అది చచ్చిపోవాలి. అలా జరగా లంటే రెండేరెండు దారులున్నా యి. ఒకటి వ్యాక్సినేషన్ . అంటే, ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలి. కానీ, ఇప్పుడి ప్పుడే వ్యాక్సిన్ను తయారు చేసే పనిలో ఉన్నా రు సైంటిస్టులు. కొన్ని చోట్ల దానిపై ట్రయల్స్ జరుగుతున్నా యి. టెస్టుల్లో అది ఎఫెక్టీవ్ అని , వైరస్ను పూర్తినాశనం చేస్తుం దని తేలిన తర్వాతే మార్కెట్లోకి, అక్కడి నుంచి జనాలకు అందుతుంది. రెండో మార్గం స్వతహాగా ఇమ్యూనిటీ తెచ్చుకోవడం. ఇది జరగాలంటే ఓ కమ్యూనిటీలో పెద్ద సంఖ్యలో జనానికి వైరస్ ఇన్ఫెక్ట్ అవ్వా  వ్వాలి. దాని నుంచి కోలుకుని రెసిస్టె న్స్ తెచ్చుకోవాలి.

అప్పటిదాకా లాక్డౌన్లే రక్ష

సరే.. వ్యాక్సిన్ రావడానికి టైంపడుతుంది. మరి, అప్పటి దాకా మనల్ని కాపాడేదేంటి? దానికి ఒకే ఒక్క మార్గం.. లాక్డౌన్. అవును, వైరస్ వ్యాప్తితగ్గాలన్నా , దాని తీవ్రత తక్కువ కావాలన్నా ప్రతి ఒక్కరూ ఇంటి గడప దాటకూడ దు. దానికి మించిన ఆయుధం, మందు లేదంటున్నారు సైంటిస్టులు. లాక్ డౌన్ తో దీర్ఘ కాలంలో కేసుల వ్యాప్తిని తగ్గించడమే కాకుండా, ఆ టైంను టెస్టిం గ్ కెపాసిటీ పెంచుకోవడం, కరోనా పాజిటివ్ వ్యక్తుల కాంటాక్ట్స్ ను  గుర్తించడం, ఇప్పటికే దాని బారిన పడిన వారికి ట్రీట్ మెంట్ చేయడం, వెంటిలేటర్లు, ఐసీయూ కేర్ యూనిట్ల వంటి హాస్పిటల్ సౌలతులు పెంచడం వంటి వాటిపై ప్రభుత్వాలు దృష్టిపెట్టడానికి వీలుంటుంది.

టెస్టింగే ఇంపార్టెంట్

వైరస్ సోకినా చాలా మందిలోలక్షణాలు కనిపించట్లేదు. ఇలాంటి సందర్భాల్లోకరోనా ఎఫెక్ట్ అయిన వాళ్లనుంచి వాళకు తెలియకుండానే ఇంకొందరికి వైరస్ పాకేస్తోం ది. దీంతో వైరస్ ప్రమాదకరంగా మారుతోంది. కాబట్టి అనుమానమున్నోళ్లందరికీ టెస్టులు కచ్చితంగా చేయా ల్సిందేనంటున్నారు నిపుణులు. దాని వల్ల బాధితులను వెంటనే గుర్తించి ఐసోలేషన్లో పెట్టేం దుకు అవకాశం దొరుకుతుందని చెబుతున్నారు. అంతేగాకుండా వాళ్ల కాంటాక్ట్స్ ను  తెలుసుకుని వాళ్లకూ టెస్టులు చేసి, క్వా రంటైన్ లేదా ఐసోలేషన్కు పంపించేందుకు వీలు చిక్కు తుందని, వైరస్ వ్యాప్తిని త్గగించే టైం దొరుకుతుందని అంటున్నారు. అప్పటికే వైరస్ సోకి కోలుకున్నోళ్ల యాంటీబాడీలతో టెస్ట్ చేసే విషయాన్ని పరిశీలించాల్సిన అవసరముందని సూచిస్తున్నా రు. ఈ టెస్ట్ ఎక్కువగా జరిగితే, వైరస్ను ఎదుర్కొనే ఆ యాంటీబాడీలున్నోళ్లను  గుర్తించేందుకు వీలవుతుందంటున్నా రు.

వాళ్ల కు ఇమ్యూనిటీ ఉంటుందా?

ఆల్రెడీ వైరస్ సోకి కోలుకున్నోళకు మళ్లీ  వైరస్ రాదని, వాళ్లకూ ఇమ్యూనిటీ వస్తుందన్న వాదనలు వినిపిస్తు న్నాయి. అయితే, నిపుణులు మాత్రం దానిపై ఇప్పుడే ఓ అవగాహనకు రాలేమని చెబుతున్నారు. మిగతా వైరస్ ల విషయంలో ఏమోగానీ, కరోనా విషయంలో మాత్రం ఆ నిరయానికి వచ్చేస్తే  తొందరపాటే అవుతుందన్నారు. అంతేకాదు, హెర్డ్ ఇమ్యూనిటీపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నా రు. ఇప్పటిదాకా డిఫ్తీరియా (75% మంది), మీజిల్స్ (91% మంది) వంటి వాటి విషయాల్లోమాత్రమే ఇమ్యూనిటీ పెరిగిందని గుర్తు చేస్తున్నా రు. కరోనా విషయంలో హెర్డ్ ఇమ్యూనిటీ రావడానికి ప్రభుత్వాలు తీసుకునే చర్యలే ముఖ్యమని నిపుణులు చెబుతున్నా రు. ఆంక్షలు లేకుండా వదిలేస్తేచాలా మంది వైరస్ బారిన పడే ముప్పు ఉంటుందని, మరణాలు పెరుగుతాయని హెచ్చరి స్తున్నారు. దాని వల్ల హెల్త్ సిస్టమ్ పై  భారం ఎక్కువవుతుందని చెబుతున్నారు. నిజానికి ఇప్పుడు చెబుతున్న లెక్కల కన్నా, వైరస్ బాధితులు ఎక్కువగానే ఉంటారని కొన్ని రీసెర్చర్లు చెబుతున్నా యి. అదే నిజమైతే ఇప్పుడు మనం అనుకునే దాని కన్నా హెర్డ్ ఇమ్యూనిటీ ఎక్కువగానే ఉండే చాన్స్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

లాక్డౌన్ ఎత్తేస్తే ముప్పే

‘అబ్బా.. ఈ లాక్ డౌన్ ను  ఇంకెప్పుడు ఎత్తేస్తా ర్రా బాబూ’.. ఇండ్లకే పరిమితమైన చాలా మంది నిట్టూర్పి ది. కానీ, కేసులు పెరుగుతున్న ఇలాంటి టైంలో లాక్డౌన్ను ఎత్తేయడమంటే ముప్పును కొని తెచ్చుకోవడమేనంటున్నారు నిపుణులు. దీని వల్ల వైరస్ మరింత వ్యాపించి కేసులు ఎక్కువయ్యే ప్రమాదం ఉందంటున్నారు. వైరస్కు మూలమైన వూహాన్ సిటీలో ఇప్పుడిప్పుడే ఆంక్షలను ఎత్తేస్తోంది చైనా సర్కార్. రెండు నెలలకు పైగా అక్కడ లాక్ డౌన్ అమల్లో ఉంది. అయితే, ప్రపంచంలోని ఏ దేశంతో పోల్చినా అక్కడ లాక్ డౌన్ ను  చాలా కఠినంగా అమలు చేశారని గుర్తు చేస్తు న్నారు. అందుకే ఇప్పుడు అక్కడ కేసులు తగ్గు తున్నాయని చెబుతున్నారు. వైరస్ వ్యాప్తి, తీవ్రతను బట్టి రెండు నుంచి ఆరు నెలల పాటు లాక్డౌన్ అవసరమని ఇంగ్లాండ్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ జెన్నీ హారిస్ తేల్చి చెబుతున్నారు. రెండు వారాల పాటు కేసుల సంఖ్యలో తగ్గుదల ఉన్నప్పుడు మాత్రమే లాక్డౌన్ను ఎత్తేస్తే లాభం ఉంటుందని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ప్రొఫెసర్ యానిలిస్ వైల్డర్ స్మిత్ అంటున్నారు.

ఎండాకాలంలో సస్తదా?

‘సమ్మర్ వచ్చేస్తోంది కదా.. వైరస్ ప్రభావం అంతలా ఉండదులే..’ అని చాలా మంది అను కుంటున్నా రు. ఒకవేళ అదే నిజమైతే అంతక న్నా కావాల్సిందేముం టుంది? కానీ, దానిని ప్రూవ్ చేసేం దుకు ఇప్పటిదాకా సరైన రుజువులేవీ లేవని చెబుతున్నారు సైంటిస్టులు. పోనీ, సమ్మర్లో పోతుందని అనుకున్నా , ఫ్లూ లాగా మళ్ సీజన్ లీ టైంకు వచ్చేఅవకాశాలు చాలా ఎక్కువే నని హెచ్చరిస్తున్నారు.

వ్యాక్సిన్ పై  గ్యారంటీ ఉందా?

వ్యాక్సిన్ తయారీకి ఎంత లేదన్నా కనీసం ఏడాదిన్నర పడుతుందని కంపెనీలు చెబుతున్నాయి. అంత తొందరగా వ్యాక్సిన్ వచ్చినా ఆశ్చర్యమేనని నిపుణులు అంటున్నారు. ఒక వ్యాక్సిన్ తయారై మార్కెట్లోకి రావాలంటే సంవత్సరాలు పడుతుందని చెబుతున్నారు. అయితే, ఆ పరిస్థితి రాకుండా సైంటిస్టులు కొత్త టెక్నాలజీలను వాడుకుంటూ వ్యాక్సిన్లు తయారు చేస్తు న్నారు. మనిషి కణాలకు వైరస్ జెనెటిక్ మెటీరియల్ (రీకాంబినెంట్ డీఎన్ఏ టెక్నాలజీ)ని కలిపి మందులను తయారు చేస్తు న్నారు. అయితే, ఆ పద్ధతులు ఎఫెక్ట్ చూపిస్తాయన్నగ్యారంటీగానీ, కంపెనీలు అవసరమైనన్ని డోసులను తయారుచేస్తాయన్న గ్యారంటీగానీ లేదని చెబుతున్నారు.

ఎక్కడున్నామన్నదీ ఇంపార్టెంటే

అమెరికా, ఇటలీ, స్వీడన్లాంటి చోట్ల జనాలు ప్రభుత్వాల మాటలు పట్టించు కోవట్లేదు. కానీ, చైనా మాత్రం కఠినంగా లాక్ డౌన్ ను  అమలు చేసింది. ఎక్కడికక్కడ నిఘా పెట్టింది. ఇంటింటికీ తిరిగి ఫీవర్, వైరస్ లక్షణాల టెస్టులు చేసింది. క్వారంటైన్లోఉన్నోళపై అనుక్షణం నిఘా పెట్టిం ది. దానిని మీరినోళ్లపై కఠిన చర్యలు తీసుకుంది. పెద్దోళ్లు, వ్యాపార వేత్తల నుంచి ఒత్తిళత్తికు తలొగ్గ లేదు. ఆ చర్యలే వైరస్ను కట్టడి చేసేందుకు సాయం చేశాయి. కానీ, చాలా దేశాల్లో ఆ పరిస్థితి లేదు. పేద దేశాల పరిస్థితి మరింత దారుణం. లాక్డౌన్ కారణంగా ఆర్థిక ర్థి వ్యవస్థనష్టాలను భరించలేని పరిస్థితి ఆ దేశాలది. సిటీలు మూసేస్తేతాము బతకలేమని ఇప్పటికే పాకిస్థాన్ తేల్చి చెప్పింది. ఆరోగ్య రంగంలోసరైన సౌలతులు లేని దేశాలదీ దాదాపు అదే పరిస్థితి.

చిన్న బిజినెస్లు తెరిస్తే…

ఈ మధ్య అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డీఏ) సహా ఆ దేశానికి చెందిన కొందరు హెల్త్ ఎక్స్ పర్ట్ లు  తయారు చేశారు. అందులో స్కూళ్లు, చిన్న చిన్న బిజినెస్లను ఓపెన్ చేయాలని సూచించారు. అయితే, అది కూడా జనాలు ఎక్కువ గా రాకుండా చూసుకోవాలని పేర్కొన్నా రు. రోడ్లపైకి వచ్చిన వాళ్లు సోషల్ డిస్టెన్సిం గ్ పాటించేలా జాగ్ర త్తలు తీసుకోవాలని చెప్పారు. అయితే, ఇంపీరియల్ కాలేజ్ లండన్ రీసెర్చర్లుమాత్రంఅది తగదని సూచి స్తున్నారు. అందరికీ ఇమ్యూనిటీ వచ్చేదాకా స్కూళ్లు, ఆఫీసులను 75 శాతం మేర బంద్ పెట్టడమే బెటర్ అని చెబుతున్నారు. టెస్టులు పెద్ద సంఖ్యలో చేయా ల్సిన అవసరం ఉందంటున్నారు.