వానాకాలం పత్తి టార్గెట్ అందుకోలే!

వానాకాలం పత్తి టార్గెట్ అందుకోలే!

హైదరాబాద్, వెలుగు:వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పత్తి సాగు నిరుడు కంటే గణనీయంగా తగ్గింది. ఈయేడు 70 లక్షల నుంచి 80 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని సర్కారు రైతులను కోరింది. అయినా వానాకాలం పత్తి సాగు నిరుడు కంటే 10.56 లక్షల ఎకరాలకు పైగా తగ్గింది. నిరుడు సర్కారు చెప్పిందని రైతులు రికార్డు స్థాయిలో పత్తి సాగు చేశారు. ఆగస్టు, సెప్టెంబరులో కురిసిన వర్షాలకు పత్తి పంట భారీగా దెబ్బతినగా.. అధిక వర్షాలతో పంట దిగుబడి తగ్గి రైతులు నష్టపోయారు. ఫలితంగా ఈఏడాది పోయినేడాది కంటే ఎక్కువగా వేయాలని సర్కారు చెప్పినా రైతులు మాత్రం ప్రత్యామ్నాయ పంటవైపే మొగ్గు చూపారు. దీంతో ఈ ఏడాది పత్తి పంట టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేదని వ్యవసాయశాఖ నివేదిక స్పష్టం చేస్తోంది. 

పెంచమంటే తగ్గించిన్రు.. 

నియంత్రిత సాగులో భాగంగా నిరుడు వానాకాలం పత్తి గతంలో ఎన్నడూ లేని విధంగా 60 లక్షల 53 వేల 890 ఎకరాల్లో సాగు చేశారు. ఈ ఏడాది కూడా పోయినేడాది కంటే పది, ఇరవై లక్షల ఎకరాలు ఎక్కువ సాగు చేయాలని రైతులను సర్కారు కోరింది. వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఈ ఏడాది పత్తిసాగు పెంచాలని కోరారు. అయితే సర్కారు చెప్పిందని పోయినేడాది పత్తి ఎక్కువ వేసిన రైతులకు పంట నష్టం జరిగితే.. సర్కారు పైసా కూడా సాయం అందించలేదు. దీంతో ఈ ఏడాది సర్కారు చెప్పిన మాటను పక్కనపెట్టిన రైతులు పోయినేడాది కంటే పది లక్షల ఎకరాలు తక్కువ సాగు చేశారు. ఈ ఏడాది 49.97 లక్షల ఎకరాల్లోనే పత్తి సాగు చేశారు. పోయినేడాది జులై నెలలో వానలు కురవగా ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 55.18 లక్షల ఎకరాల్లో పత్తి వేశారు. ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి వర్షాలు కురుస్తుండగా.. ఒక నెల ముందుగానే పంటలు వేసినా ఇప్పటి వరకు 50 లక్షల ఎకరాలు దాటలేదు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పత్తి సాగు పెంచే అవకాశం తక్కువేనని ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంటున్నరు.

నిరుడు వానలతో పత్తి సాగుపై ఎఫెక్ట్ 

సర్కారు చెప్పిందని పత్తి 60.53 లక్షల ఎకరాల్లో సాగు చేయగా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన వర్షాలకు పంటలు బాగా దెబ్బతిన్నాయి. 16 లక్షల ఎకరాలు వరదలకు, మరో పది లక్షల ఎకరాల్లో పత్తి తెగుళ్లతో దెబ్బతిన్నాయి. వర్షాలకు కొట్టుకుపోగా మిగిలిన పత్తి నుంచి ఆశించిన స్థాయిలో పూత, కాత రాలేదు. అక్టోబరులో కాయ నుంచి దూది వచ్చే సమయంలో కురిసిన వర్షాలతో పత్తి నేలపాలైంది. దీంతో ఎకరానికి 10 నుంచి12 క్వింటాళ్లు రావాల్సిన పత్తి దిగుబడి.. రెండు నుంచి మూడు క్వింటాళ్లకు పడిపోయింది. ఎకరానికి అయిదు నుంచి ఆరు క్వింటాళ్ల వరకు తగ్గి.. దిగుబడి 45 శాతానికి పడిపోయింది. దీంతో రూ.13వేల కోట్ల వరకు నష్టం జరిగిందనే అంచనాలు ఉన్నాయి.