వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో బయటపడ్డ వైద్యుల నిర్లక్ష్యం.. అప్పుడేపుట్టిన బాబు మృతి

వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో బయటపడ్డ వైద్యుల నిర్లక్ష్యం.. అప్పుడేపుట్టిన బాబు మృతి

ప్రభుత్వ వైద్యశాలలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యంతో అప్పుడే పుట్టిన బాబు మృతి చెందాడు. హయత్ నగర్ కి చెందిన శిరీష అనే మహిళకు తెల్లవారు జామున 2:45 గంటలకి డెలివరీ చేశారు వైద్యులు. ఈ క్రమంలోనే బొడ్డు పేగు మొదటగా కత్తిరించడంతో బాబు మృతి చెందాడు.

ఇలాంటి ఘటనలు పదే పదే జరుగుతున్న  ఆసుపత్రి వైద్యుల తీరు మాత్రం మారడం లేదని పేషెంట్ల తరపు బంధువులు చెబుతున్నారు. ఘటనలపై బాధ్యులైన వైద్యులపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకొవడం లేదని తెలిపారు. శిరీష తరపు బంధువులు ఆస్పత్రి వద్ద గొడవ చేయగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని దర్యాప్తు చేశారు.

మొదట కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పోస్ట్ మార్టం చేయాల్సి వస్తుందని చెప్పడంతో చిన్న బిడ్డను కోస్తారనే భయంతో ఫిర్యాదు వెనక్కు తీసుకున్నారు. తమ ప్రమేయంపై ఆస్పత్రి సిబ్బంది స్పందించడానికి నిరాకరిస్తున్నారు. ఈ క్రమంలోనే బాధితులు వారిపై ఫైర్ అవుతున్నారు. పోలీసులు వారకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.