2021 ప్రారంభం నాటికి క‌రోనా వ్యాక్సిన్ విడుద‌ల కాక‌పోవచ్చు : కేంద్ర ఆరోగ్య శాఖ ‌మంత్రి

2021 ప్రారంభం నాటికి క‌రోనా వ్యాక్సిన్ విడుద‌ల కాక‌పోవచ్చు : కేంద్ర ఆరోగ్య శాఖ ‌మంత్రి

2021 ప్రారంభంలో క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ రాక‌పోవ‌చ్చ‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ‌మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ అన్నారు.

దేశంలో ప్ర‌తీరోజు క‌రోనా కేసులు భారీ స్థాయిలో న‌మోద‌వుతున్నాయి. దీంతో ప్ర‌తీ ఒక్క‌రూ క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ ఎప్పుడు వ‌స్తుందా అని ఎదురు చూస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో క‌రోనా వ్యాక్సిన్ పై కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ స్పందించారు. గతేడాది చైనాలో ప్రారంభ‌మైన క‌రోనా వైర‌స్ కు ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ దేశం వ్యాక్సిన్ త‌యారు చేయ‌లేక‌పోయింద‌ని , 2021 ప్రారంభంలో టీకా మార్కెట్‌లోకి రాకపోవచ్చన్నారు. జులై నెల‌లో టీకా విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

తొల‌త విడుద‌లైన వ్యాక్సిన్ ఎవ‌రికి అందిస్తార‌నే చ‌ర్చ దేశ వ్యాప్తంగా జ‌రుగుతుంద‌ని, కానీ ముందుగా సీనియర్ సిటిజన్లు, క‌రోనా రిస్క్ ఎక్కువ‌గా ఉన్న‌వారికి అందించే విష‌యంపై కేంద్రం పరిశీలిస్తోంద‌న్నారు.

వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేష‌న్ పై జాతీయ నిపుణుల బృందం వీలైనంత ఎక్కువ మందికి ఇమ్యూనిటీ ప‌వ‌ర్ ఎలా క‌ల్పించాల‌నే దానిపై వివరణాత్మక వ్యూహాన్ని రూపొందిస్తోందని కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్షవ‌ర్ధ‌న్ తెలిపారు.