‘గణేశ్’ నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో జరగాలె 

‘గణేశ్’ నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో జరగాలె 

హైదరాబాద్ : రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగే గణేష్ నిమజ్జనాల కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని సీపీ మహేష్ భగవత్ చెప్పారు. శుక్రవారం సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ పై జరగనున్న గణేశ మహా నిమజ్జనం వేడుకలను అందరూ ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కర్మన్ ఘాట్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో ఎల్బీనగర్ డీసీపీ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి సమావేశం నిర్వహించారు. వారికి సలహాలు, సూచనలు చేశారు.

గణేష్ విగ్రహాల నిమజ్జనానికి వచ్చే భక్తులు పోలీసు సిబ్బందికి సహకరించాలని రాచకొండ సీపీ మహేష్ భగవత్ కోరారు. రాచకొండ పరిధిలో గురువారం ఉదయం బాలాపూర్ గణేష్ లడ్డూ ప్రసాదం వేలం కార్యక్రమానికి బందోబస్తుతో పాటు మిగతా ఏర్పాట్లు కూడా చేశామన్నారు. సరూర్  నగర్ చెరువు, నాగోల్, ఇనాంగూడ, మంత్రాల చెరువుల వద్ద క్రేన్స్, సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేశామన్నారు. భక్తుల సౌకర్యం కోసం అందుబాటులో తాగునీటి సౌకర్యం కల్పించామన్నారు. మహిళలకు మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశామన్నారు.