కోవిడ్ పేషెంట్లకు ఫ్రీ ఫుడ్

కోవిడ్ పేషెంట్లకు ఫ్రీ ఫుడ్

హైదరాబాద్, వెలుగు: సిటీలో కరోనా బారిన పడి వంట చేసుకోలేని వారికి ఇంటి వద్దకే పంపిస్తూ పలువురు మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కూతుళ్లు, కొడుకులు విదేశాల్లో ఉండి, ఇక్కడ ఒంటరిగా ఉంటున్న వృద్ధులకు కొవిడ్​ వచ్చిందని తెలిస్తే చాలు వంట, పని మనుషులు మానేస్తుండగా, సొంతంగా ప్రిపేర్​ చేసుకోవడం, బయటకు వెళ్లి ఫుడ్ తెచ్చుకునే వీలు లేకపోవడం, ఆన్​లైన్​లో ఆర్డర్లు పెట్టుకోవడం రాక, వచ్చినా వాటిని తినలేక ఇబ్బందులు పడుతున్నారు.  వీరితో పాటు స్టూడెంట్లు, ఎంప్లాయీస్ ​కూడా ఐసోలేషన్ లో ఉంటూ ఫుడ్ కోసం కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారికి మేమున్నామంటూ ఇంటి ఫుడ్​ను అందిస్తున్నారు సిటీకి చెందిన పలువురు. కొవిడ్​ ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ లో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి ఫ్రీగా ఫుడ్​ అందించడం స్టార్ట్​ చేశారు. థర్డ్​వేవ్​లోనూ హోమ్ ఐసోలేషన్ లో ఉండి ఫుడ్​ కోసం ఇబ్బంది పడుతున్న వారికి హెల్ప్​ చేస్తున్నారు. ఫ్రీ ఫుడ్ ఫర్ కొవిడ్ పేషెంట్స్ అంటూ ఒక పోస్టర్ క్రియేట్ చేసి దాన్ని వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్నారు. అవపరమైన వారు సంప్రదిస్తున్నారు. ప్రస్తుతం సిటీలోని అన్ని ఏరియాల్లో ఇండివిజ్యువల్ గా సర్వీస్ చేస్తున్నవారే ఎక్కువగా ఉన్నారు.  తమ ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసి మధ్యాహ్నం, రాత్రి  హోమ్ డెలివరీ చేస్తున్నారు.  

రిపోర్ట్, అడ్రస్ ​కన్ఫర్మ్​ చేసుకుని..

ఫుడ్​ అవసరమైన కొవిడ్​ పేషెంట్లు ఫ్రీ ఫుడ్ డెలివరీ చేసేవారిని వాట్సాప్ లో కాంటాక్ట్ అవుతున్నారు.   ఫుడ్ అందిస్తున్న వారు పేషెంట్ల పాజిటివ్ రిపోర్ట్ పంపించమని అడుగుతున్నారు. కన్ఫర్మ్​ చేసుకున్నాక ఇంటి అడ్రస్, లొకేషన్ మెసేజ్ చేశాక ఫుడ్​ అందిస్తున్నారు. మియాపూర్ కి చెందిన భార్గవ్ దంపతులు గతేడాది నుంచి కొవిడ్ పేషెంట్లకు ఫ్రీగా ఫుడ్ అందిస్తున్నారు. వారి నెంబర్లు అప్పట్లో బాగా సర్క్యూలేట్​ అవడంతో థర్డ్ వేవ్ లో భాగంగా  పాజిటివ్ ​వచ్చిన వారు  మళ్లీ కాంటాక్ట్  అవుతున్నారు. పేషెంట్ల నుంచి కాల్స్ ఎక్కువగా వస్తుండగా ఈనెల 13 నుంచి  ఫ్రీ ఫుడ్ డ్రైవ్ ప్రారంభించామని భార్గవ్ దంపతులు చెప్తున్నారు. ప్రతిరోజు 50 మందికి సర్వ్ చేయాలని టార్గెట్ పెట్టుకోగా,  ప్రస్తుతం150 మందికి చేరిందని పేర్కొంటున్నారు. తాము సర్వ్ చేస్తున్న ఏరియాల్లో ఎవరైనా హోమ్ ఐసోలేట్ అయి ఫుడ్ లేక ఇబ్బంది పడుతుంటే  8886686000 నంబర్​కు కాంటాక్ట్ అయితే పంపిస్తామని అంటున్నారు. 

డోర్ ​ముందు పెట్టి కాలింగ్ ​బెల్ ​కొట్టి..

మధ్యాహ్నం, రాత్రి  రెండు రకాల కూరలు, పెరుగు ప్యాక్ చేసి పుడ్​ అందిస్తున్నారు.  కొవిడ్​ రూల్స్​మస్ట్ గా పాటిస్తూ పేషెంట్ ఇంటికి వెళ్లాక డోర్ బయట ఫుడ్ పెట్టి కాలింగ్ ​కొట్టి వెళ్తున్నారు.  మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు అవసరమైన వారికి  ఫుడ్​ పంపిణీ చేస్తున్నారు. ఇంట్లోనే వంట చేసుకుని చుట్టుపక్కల పాజిటివ్​ వచ్చినవారెవరైనా ఉంటే ఫుడ్ ​అందిస్తున్న వారు కూడా ఉన్నారు.  ఇందుకోసం స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న వలంటీర్లను కలుపుకుంటున్నారు. వారి సాయంతో రోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రిక్వెస్ట్ లను తీసుకుంటున్నామని పలువురు చెప్తున్నారు. కేసులు పెరుగుతుండగా ఇప్పటికే పలువురు ఈ ఫ్రీ ఫుడ్ డ్రైవ్ మొదలుపెట్టగా, మరికొందరు స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. 

మెడిసిన్, గ్రోసరీ అందిస్తున్నాం..

ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ ఉన్నవారికి  మెడిసిన్, గ్రోసరీ అందిస్తున్నాం. ఫుడ్ సర్వ్​కూడా  కొద్దిరోజుల్లోనే స్టార్ట్  చేస్తాం. ఇందులో లంచ్, డిన్నర్ మీల్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం. 
– విజయ్, హోప్ ఫౌండేషన్


కూకట్​పల్లిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉండే 50 ఏండ్ల అనంతమ్మకు కొద్దిరోజుల కిందట కరోనా సోకింది. దీంతో వంట, పని మనుషులు రావడం మానేశారు. ఆమె పిల్లలు అమెరికాలో ఉండగా సొంతంగా ఫుడ్​ప్రిపేర్​ చేసుకునేందుకు ఇబ్బంది పడాల్సి వచ్చింది. హోం ఐసోలేషన్ లో ఉన్నవాళ్లకి ఫ్రీగా రెండు పూటల ఫుడ్​అందిస్తున్నారని ఆమెకు తెలిసినవాళ్లు చెప్పారు. ఫోన్​నంబర్​తీసుకుని కొవిడ్​పాజిటివ్ రిపోర్ట్, ఇంటి అడ్రస్ వారికి మెసేజ్ చేసింది. ప్రస్తుతం ఆమెకు ఫ్రీగా ఫుడ్​ అందిస్తున్నారు.