ఆసిక్స్ బ్రాండ్ అంబాసిడర్ గా రవీంద్ర జడేజా

ఆసిక్స్ బ్రాండ్ అంబాసిడర్ గా రవీంద్ర జడేజా

అంతర్జాతీయ క్రీడా ఉపకరణాల సంస్థ 'ఆసిక్స్' తన బ్రాండ్ అంబాసిడర్ గా టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజాను నియమించింది. ఫీల్డింగ్ కు పెట్టింది పేరైన రవీంద్ర జడేజా ఇటీవల కాలంలో ఆల్ రౌండ్ నైపుణ్యంతో అదరగొడుతున్నాడు. టీమిండియాకైనా, ఐపీఎల్ టీమ్ కైనా ఒకేరకం అంకింతభావం కనబరిచే జడ్డూను 'ఆసిక్స్' బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక సెలక్ట్ చేసింది. దీనిపై స్పందించిన రవీంద్ర జడేజా..భారత్ లో 'ఆసిక్స్' బ్రాండ్ అంబాసిడర్ గా నియామకం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు . మనసులను, శరీరాలను సరికొత్త శక్తి దిశగా నడిపించే బ్రాండ్ 'ఆసిక్స్' తో కలిసి పనిచేసేందుకు ఎంతో ఉత్సాహంతో ఉన్నట్లు చెప్పాడు.

ఈ సందర్భంగా కరోనాతో జాగ్రత్తగా ఉండాలని జడేజా తెలిపాడు. ఈ పరీక్షా సమయంలో అందరూ ఇళ్లలోనే ఉంటూ సురక్షితంగా ఉండాలని పిలుపునిచ్చాడు. బయటికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, ఎప్పటికప్పుడు చేతులను శానిటైజ్ చేసుకోవడం, శుభ్రం చేసుకోవడంలాంటి రక్షణ చర్యలు పాటించాలని సూచించాడు.