జూబ్లీహిల్స్, వెలుగు: కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి, భూమిని ఆక్రమించిన ప్రముఖ సినీ నిర్మాతలు సి.కల్యాణ్, బూరుగుపల్లి శివరామకృష్ణలపై క్రిమినల్ కేసు నమోదైంది. వ్యాపారవేత్త కాంతమనేని రవిశంకర్ ఆధీనంలో ఉన్న జూబ్లీహిల్స్ ఉమెన్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలోని ప్లాట్ నంబర్89 స్థలంపై ప్రస్తుతం కోర్టు స్టే ఉంది.
అయితే, గత జూన్ 10న నిర్మాతలు కల్యాణ్, శివరామకృష్ణ తమ అనుచరులతో కలిసి ప్లాట్ గేటును పగులగొట్టి, లోపల ఉన్న షెడ్డును కూల్చివేసి ఆక్రమణకు పాల్పడ్డారు. బాధితుడు రవిశంకర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
