ప్రభుత్వాన్ని విమర్శించడం విపక్షాల హక్కు

ప్రభుత్వాన్ని విమర్శించడం విపక్షాల హక్కు

న్యూఢిల్లీ: ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు ఉందని వైస్ ప్రెసిడెంట్, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అన్నారు. అయితే అవి నమ్మదగినవిగా ఉండాలని సూచించారు. రాజ్యసభలో కొత్తగా ఎగువ సభకు హాజరైన నేతలకు వెంకయ్య ఈ సూచనలు చేశారు. ‘ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, నిలదీయడం ప్రతిపక్షాల హక్కు. అది వారి విధి కూడా. అయితే విమర్శలు, ప్రశ్నలు సూటిగా, నమ్మదగినవిగా, సమాచారాత్మకంగా ఉండాలి. కావాలని ప్రభుత్వం ఏం చేసినా విమర్శించడం మాత్రం సరికాదు. ప్రభుత్వంతోపాటు మీడియా, ప్రజల దృష్టిని ఆకర్షించేలా విమర్శలు ఉండాలి’ అని వెంకయ్య నాయుడు చెప్పారు.