ఏడ్చేందుకు ఓ క్లబ్ ఉంది

ఏడ్చేందుకు ఓ క్లబ్ ఉంది

బషీర్ బాగ్, -వెలుగు: వివిధ సమస్యలతో సతమతం అవుతున్నారా?, మనసంతా దుఖంతో నిండిపోయిందా?. చుట్టూ అందరూ ఉండటం వల్ల మనస్ఫూర్తిగా ఏడ్వలేకపోతున్నారా? అయితే మా క్లబ్ కి రండి, మీరు తనివితీరా..మనస్ఫూర్తిగా ఏడ్వవచ్చు అంటున్నారు ‘ఏబీసీ లాఫింగ్‌ క్లబ్‌’ వారు. ఎలా ఏడ్వాలి అనే అంశంపై ట్రైనింగ్ కూడా ఇస్తామంటున్నారు . శనివారం బషీర్ బాగ్‌లోని దేశోద్ధారక భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో క్లబ్‌ చైర్మన్‌ ఏ.వి.సత్యనా రాయణ మాట్లా డుతూ.. ‘ఏబిసి లాఫింగ్‌ క్లబ్‌’ ఆధ్వర్యంలో క్రైయింగ్‌ క్లబ్ ని కూడా ప్రారంభిస్తున్నామన్నారు . ఆదివారం ఉదయం 9గంటలకు సికింద్రాబాద్ లోని గుజరాతీ సేవా మండల్, బల్దేవ్‌ హాల్‌లో ఈ క్లబ్ ని గుజరాత్ కు చెందిన లాఫింగ్‌ క్లబ్‌ వ్యవస్థాపకులు కమలేష్‌ మసాలవాల ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు లక్ష్మణ్‌, తదితరులు పాల్గొ న్నారు .