మహా రక్తపాతం సృష్టిస్తం: అమెరికాకు క్యూబా మాస్ వార్నింగ్

మహా రక్తపాతం సృష్టిస్తం: అమెరికాకు క్యూబా మాస్ వార్నింగ్

హవానా: అమెరికాకు క్యూబా మాస్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా తమ దేశంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే రక్తపాతం సృష్టిస్తామని క్యూబా హెచ్చరించింది. అమెరికా ఆంక్షల కారణంగా క్యూబాలో తీవ్ర ఇంధన, విద్యుత్ సంక్షోభం తలెత్తింది. దీంతో ఆ దేశ ప్రజలు ఇంధనం, విద్యుత్ లేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు.

 క్యూబాలో అధ్యక్షుడు మిగెల్ డియాజ్-కానెల్‌ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ఇది అమెరికా చేస్తోన్న కుట్ర అని క్యూబా ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే అమెరికాపై దాడులు చేసేందుకు రష్యా, ఇరాన్‌ల నుంచి క్యూబా 300కు పైగా సైనిక డ్రోన్‌లను కొనుగోలు చేసిందని అమెరికన్ వార్తా సంస్థ ఆక్సియోస్ నివేదించింది. 

►ALSO READ | ఇరాన్ ఆయిల్పై అమెరికా ఆంక్షల ఎత్తివేత.. ట్రంప్ అంగీకరించారంటూ ఇరాన్ మీడియాలో వార్తలు

ఈ వార్తలపై క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్-కానెల్ స్పందించారు.  అమెరికాకు గానీ మరే ఇతర దేశానికి గానీ ముప్పు కలిగించే విధంగా క్యూబా ప్రవర్తించడం లేదని వివరణ ఇచ్చారు. అదే  సమయంలో ఇతరుల సైనిక దాడి నుంచి తనను తాను రక్షించుకోవడానికి క్యూబాకు సంపూర్ణమైన చట్టబద్ధమైన హక్కు ఉందని అన్నారు.

 ఒకవేళ అమెరికా క్యూబాపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే వియత్నాం యుద్ధ శైలిలో క్యూబా ప్రజలు ఆయుధాలు చేతబట్టి చివరి వరకు గెరిల్లా పద్ధతిలో పోరాడతారని.. అది ఒక మహా రక్తపాతంగా మారుతుందని హెచ్చరించారు. అదేవిధంగా, తమపై సైనిక దాడికి అమెరికా ఒక తప్పుడు, ప్రణాళికాబద్ధమైన సాకును సృష్టిస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.