హైదరాబాద్, వెలుగు: హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో గురువారం చర్లపల్లి సెంట్రల్ జైలును సీవీ ఆనంద్ సందర్శించారు. జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రాతో కలిసి జైలు హాస్పిటల్, స్టోర్లు, అన్నపూర్ణ కిచెన్, ఖైదీల ఉత్పత్తులను పరిశీలించారు. జైళ్లలో అమలవుతున్న సంస్కరణలు, విద్యా కార్యక్రమాలు, ఖైదీలకు అందిస్తున్న వృత్తి–నైపుణ్య శిక్షణ, సంక్షేమ పథకాలు, ఆరోగ్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు.
ఖైదీలకు చెల్లిస్తున్న వేతనాలు, అందిస్తున్న పోషకాహారం, వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. డీజీ సౌమ్య మిశ్రా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జైళ్లలో అమలవుతున్న పథకాలు, సంస్కరణలపై వివరించారు.
