- స్కూల్స్ , వివిధ క్యాంపస్ లు ముగిసే టైంలోనే వెల్లువ
- ఐటీ కారిడార్‌లో కంటే ఎక్కువ
- నివారణ కోసం స్టూడెంట్ మొబిలిటీ ప్లాన్: సైబరాబాద్ సీపీ రమేశ్
గచ్చిబౌలి, వెలుగు : స్కూల్స్ముగిసే టైంలో కేవలం15 నిమిషాల వ్యవధిలోనే సైబరాబాద్ వ్యాప్తంగా వివిధ క్యాంపస్‌ల నుంచి సమారు 2 లక్షల వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయని, ఈ రద్దీ సైబరాబాద్ ఐటీ కారిడార్‌లో పీక్ అవర్స్‌లో ఉండే ట్రాఫిక్ కంటే ఎక్కువగా ఉంటోందని సైబరాబాద్ సీపీ రమేశ్తెలిపారు. గచ్చిబౌలి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ శతాబ్ది కన్వెన్షన్ సెంటర్‌లో కమిషనరేట్, ఎస్‌సీఎస్‌సీ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సు నిర్వహించారు.
దీనికి 500 విద్యాసంస్థలకు చెందిన 750 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. సీపీ రమేశ్మాట్లాడుతూ ఎడ్యుకేషన్ఇన్స్టిట్యూషన్స్లో విద్యార్థుల రవాణా సమస్యలను పరిష్కరించడానికి, ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి స్టూడెంట్ మొబిలిటీ ప్లాన్ రూపొందించినట్టు చెప్పారు. సైబరాబాద్ పోలీస్ అండ్సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ 526 విద్యాసంస్థల్లో సర్వే చేయగా అనేక సమస్యలు బయటపడ్డాయన్నారు.
వీటికి పరిష్కారంగా స్కూల్స్, రవాణా ఆపరేటర్లు, పేరెంట్స్, సివిల్అథారిటీస్ను ఒకే వేదికపైకి తీసుకువచ్చేలా ఒక టెక్నికల్ప్లాట్ఫామ్ను సిద్ధం చేశామన్నారు. ఇందులో పిల్లల భద్రతకు, సాఫీగా సాగే ట్రాఫిక్ కదలికలకు సమాన ప్రాధాన్యత ఉంటుందన్నారు. లాస్ట్-మైల్ కనెక్టివిటీ కోసం గిగ్ వర్కర్లు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలకు భాగస్వామ్యం కల్పిస్తామని తెలిపారు.
కొద్ది మందే ఆ ఫెసిలిటీ వాడుకుంటున్నరు..
ఎస్‌సీఎస్‌సీ సీఈఓ నవేద్ ఖాన్ మాట్లాడుతూ దాదాపు 80 శాతం విద్యాసంస్థలు ట్రాన్స్పోర్ట్సౌకర్యాన్ని కల్పిస్తుండగా, 30 శాతం మంది మాత్రమే ఆ సేవలను వినియోగించుకుంటున్నారు. మిగిలిన వారు సొంత వాహనాల్లో ప్రయాణిస్తుండడంతో ట్రాఫిక్‌జామ్స్, రద్దీ ఏర్పడుతోందన్నారు.
శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ అమిత్, కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన, ట్రాఫిక్ డీసీపీ శేషాద్రిని రెడ్డి, కూకట్‌పల్లి జెడ్సీ మయాంక్ సింగ్, టీజీఆర్‌టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్ అపర్ణ కల్యాణి, ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రామేశ్వరరావు పాల్గొన్నారు.
