ట్రేడింగ్ పేరుతో మోసం చేస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురిని అరెస్ట్ చేసి.. 9 కోట్ల 81లక్షలు స్వాధీనం చేసుకున్నామని సీపీ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. మార్కెట్ బాక్స్ అనే ఆన్ లైన్ ట్రేడింగ్ యాప్ తో మోసం చేస్తున్నట్లు గుర్తించామన్నారు.ఇందులో 3 వేల మంది రిజిస్టరయి ట్రేడింగ్ చేస్తున్నారన్నారు.
యూపీకి చెందిన అభిషేక్ జైన్ (ఏ1) మార్కెట్ బాక్స్ అనే ఫేక్ యాప్ తయారు చేసి ఆన్ లైన్ లో ప్రమోట్ చేశాడని చెప్పారు. ఇది దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైమ్ ప్రాపర్టీ సీజ్ చేసిన కేసు అని సీపీ చెప్పారు. గతేడాది వచ్చిన ఒక కంప్లెయింట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. యూపీకి వెళ్లి నిందితులను అరెస్ట్ చేశామని స్టీఫెన్ రవీంద్ర అన్నారు .
