IPL 2026: RCB vs RR అభిమానులకి షాక్.. వర్షం కారణంగా టాస్ ఆలస్యం

IPL 2026: RCB vs RR అభిమానులకి షాక్.. వర్షం కారణంగా టాస్ ఆలస్యం

IPL 2026: గౌహతిలోని బర్సపరా స్టేడియంలో ఈరోజు (2026, ఏప్రిల్ 10న) జరగాల్సిన 'బిగ్ ఫైట్' వర్షం కారణంగా ఆలస్యం అవుతోంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని రెండు బలమైన జట్ల మధ్య పోరు కావడంతో అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

వర్షం కారణంగా టాస్ ఆలస్యం: 
గౌహతిలో ప్రస్తుతం తేలికపాటి వర్షం కురుస్తుండటంతో టాస్ వేయడం ఆలస్యమైంది. వాన కురుస్తుండటంతో పిచ్‌ను, స్క్వేర్‌ను గ్రౌండ్ స్టాఫ్ పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. Accuweather ప్రకారం, రాత్రి 9 గంటల తర్వాత వాతావరణం మెరుగుపడే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం తగ్గితే, ఓవర్ల తగ్గింపుతో మ్యాచ్ నిర్వహించే ఛాన్స్ కనిపిస్తుంది. మ్యాచ్ ఫలితం తేలాలంటే రెండు జట్లు కనీసం 5 ఓవర్ల చొప్పున ఆడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ మ్యాచ్ పూర్తిగా రద్దయితే, రెండు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయిస్తారు.

నేటి మ్యాచ్ ప్రత్యేకతలు: 
* యువ రక్తం vs అనుభవం: 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (RR) వర్సెస్ 37 ఏళ్ల దిగ్గజం విరాట్ కోహ్లీ (RCB) మధ్య జరిగే పోరు నేటి మ్యాచ్‌కే హైలెట్ గా నిలవనుంది. 
* పాయింట్ల పట్టికలో అగ్రస్థానం: రాజస్థాన్ ప్రస్తుతం 3 విజయాలతో పట్టికలో నెంబర్ –1 స్థానంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు గెలిస్తే, మెరుగైనా రన్ రేట్ ఉండటం వల్ల వారు అగ్రస్థానానికి చేరుకునే ఛాన్స్ ఉంది. 
* గుజరాత్ రికార్డు: రాజస్థాన్ ఈ మైదానంలో ఆడిన గత 10 మ్యాచ్‌ల్లో 5 గెలిచింది. బెంగళూరుకు ఈ మైదానంలో ఇదే మొదటి మ్యాచ్ కావడం విశేషం.

తుది జట్లు:
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్.

►ALSO READ | IPL 2026: ఐపీఎల్ కి హసరంగ దూరం.. లక్నో జట్టులోకి సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ.