
బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7)లోకి వెళ్లిన ఫేమున్న కంటెస్టెంట్ లలో సింగర్ దామిని(Damini) ఒకరు. గాయనిగా బయట ఆమెకు చాలా ఫాలోయింగ్ ఉంది. కానీ.. ఆ ఫాలోయింగ్ ను హౌస్ లో సరిగా ఉపయోగించుకోలేకపోయిందనే చెప్పాలి. ఆ కారణంగానే మూడోవారంలోనే ఇంటి నుండి బయటకు వచ్చేసింది.
దానికి కారణం దామినికి వంటలక్క అనే పేరు వచ్చేసింది. ఎక్కువసేపు కిచన్ లోనే ఉండటం. ఆమెకు సంబంధంలేని విషయాలలో వేళ్ళు పెట్టడం, కానిదానికీ నోరేసుకొని పడిపోవడం వంటివి చేయడం వల్ల ఆమెకు ఆడియన్స్ లో నెగిటీవ్ ఇంపాక్ట్ ను క్రియేట్ చేసింది. ఇక రీసెంట్ టాస్క్ లో యావర్ తో ఆమె బిహేవ్ చేసిన తీరు కూడా జనాలకు నచ్చలేదు. ఆ కారణంగానే దామిని ఇంటి నుండి బయటకు వచ్చేసింది.
ALSO READ | ఈ వారం థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు ఇవే
ఏది ఏమైనా.. ఈ మూడు వారాలకుగానూ ఆమెకు పారితోషికం మాత్రం గట్టిగానే ముట్టిందట. వారానికి రూ.2 లక్షల చొప్పున మూడు వారాలకు గాను మొత్తం ఆరు లక్షల రూపాయలు సంపాదించిందట దామిని. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.