ఈ వారం థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు ఇవే

ఈ వారం థియేటర్లలో విడుదలయ్యే  సినిమాలు ఇవే

టాలీవుడ్,కోలీవుడ్, బాలీవుడ్ ఏ ఇండస్ట్రీ అయినా శుక్రవారం వచ్చిందంటే సినిమాల పండుగే కనిపిస్తుంది. సినిమా లవర్స్కి..వీకెండ్ దొరికితే చూడటానికి టైం చాలకుండా..వారం వారం మూవీస్ రిలీజ్ అవుతున్నాయి.ఇక ఏకంగా సెప్టెంబర్ నెల అంతా పండుగే మొదలవ్వగా..ఈ నెల లాస్ట్ వీకెండ్లో రిలీజ్ అయ్యే సినిమాలేంటో ఒక లుక్కేద్దాం. 

ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలు 

ఉస్తాద్ రామ్‌(Ustaad Ram), మాస్ డైరెక్టర్ బోయపాటి (Boyapati) కాంబినేషన్‌లో వస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ స్కంద (Skandha). అఖండ వంటి బ్లాక్ బస్టర్ తరువాత బోయపాటి నుండి వస్తున్న ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి.ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా..శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అదిరిపోయాయి. పాన్ ఇండియా లెవల్లో సెప్టెంబర్‌ 28న విడుదల కానున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.

చంద్రముఖి 2

రాఘవ లారెన్స్(Ragava Lawrence) మోస్ట్  ఎవెయిటెడ్‌ ప్రాజెక్ట్‌ చంద్రముఖి 2(Chandramukhi 2 ). పి వాసు( P Vasu) డైరెక్షన్ లో రూపొందుతున్నఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఆద్యంతం ఆసక్తి కలిగించే ఈ ట్రైలర్ ఆడియన్స్ని మరోసారి చంద్రముఖి గదిలోకి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. 

దాదాపు 17ఏళ్ల తర్వాత చంద్రముఖి మూవీకు సీక్వెల్‌ తెరకెక్కుతుండటం విశేషం. ఈ మూవీలో లారెన్స్ ప్రసెంట్..పాస్ట్ గెటప్స్లో కనిపించబోతున్నట్లు ట్రైలర్ లో చూపించారు. వెట్టయరాజగా ఫ్లాష్‍బ్యాక్‍లో లారెన్స్ రాజసం చూపించారు.అలాగే చంద్రముఖి, వెట్టయరాజకి మధ్యన ఉన్న 200 ఏళ్ళ నాటి పగను చూపిస్తున్నట్టు తెలుస్తోంది. 

చంద్రముఖి 2 మూవీని తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీకి గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు విన్నర్‌, లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడ‌క్షన్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ మూవీ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ది వ్యాక్సిన్ వార్ 

ది కాశ్మీర్ ఫైల్స్(The Kashmir files) లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి(Vivek Agnihotri) నుంచి వస్తున్న చిత్రం ది వ్యాక్సిన్ వార్(The Vaccine War). అనుపమ్ ఖేర్, సప్తమి గౌడ, పరితోష్ శాండ్, స్నేహ మిలాండ్, దివ్య సేథ్ నటిస్తున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ డ్రిల్స్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పల్లవి జోషి  నిర్మిస్తూ, కీలక పాత్రలో నటిస్తున్నారు. లేటెస్ట్గా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేయగా..అందరికీ ఎమోషనల్ గా కనెక్ట్ అయింది. 

ఈ ట్రైలర్లో కరోనా టైంలో నెలకొన్న ప్రాబ్లమ్స్, ప్రజల్లో కలిగిన భయాందోళనలు,అందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు కళ్ళకి కట్టినట్లు చూపించారు. ప్రతి ఒక్కరు పేస్ చేసిన కరోనా ప్యాండమిక్ సిట్యుయేషన్ని డైరెక్టర్ చాలా బాగా చూపించారు. టీకా కనిపెట్టడానికి భారత్ సైంటిస్ట్ లు ఎదురుకున్న సవాళ్లు అన్నిటిని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్‌‌ మెడికల్ రీసెర్చ్’ డైరెక్టర్ జనరల్‌‌ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ రాసిన ‘గోయింగ్ వైరల్‌‌.. మేకింగ్ ఆఫ్‌‌ కో వ్యాక్సిన్‌‌’ అనే బుక్ ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు వివేక్.ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో 28 సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న 11 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. 

పెదకాపు 1

కొత్త బంగారు లోకం(Kotha bangaru lokam) ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల(Srikanth addala) దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ పెదకాపు 1(Pedakapu1). రూరల్ అండ్ పొలిటికల్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాతో విరాట్ కర్ణ(Virat karna) హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. రీసెంట్గా ఈ మూవీ నుంచి టీజర్, ట్రైలర్ రిలీజ్ అవ్వగా..గ్రామాల్లో ఉండే వర్గ పోరు, రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని అర్థమవుతోంది.

పెదకాపు మూవీని ద్వారకా క్రియేషన్స్‌(Dwarakacreations) బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి భాగం పెదకాపు1 ఈ నెల (సెప్టెంబర్29న) విడుదల కానుంది. ఇందులో విరాట్ కర్ణకి జోడీగా ప్రగతి శ్రీవాస్తవ నటిస్తున్నారు. వీరిద్దరికీ ఇదే ఫస్ట్ మూవీ కావడం విశేషం. మెలోడీ మిక్కీ జే మేయర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.