హైదరాబాద్, వెలుగు: టీటీడీ బోర్డు మెంబర్గా దాసరి కిరణ్ కుమార్ సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద డిప్యూటీ ఈవో రమేష్ బాబు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్న కిరణ్ కుమార్కు రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు.
ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. స్వామికి సేవ చేసేందుకు తనకు బోర్డు సభ్యునిగా అవకాశం కల్పించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బోర్డు సెల్ డిప్యూటీ ఈవో కస్తూరీబాయి, పేష్కార్ శ్రీహరి, పారుపత్తేదార్ తులసీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
