David Warner: వార్నరా.. మజాకా! హెలిక్యాప్టర్‌లో ఎంట్రీ ఇవ్వనున్న డేవిడ్ భాయ్

David Warner: వార్నరా.. మజాకా! హెలిక్యాప్టర్‌లో ఎంట్రీ ఇవ్వనున్న డేవిడ్ భాయ్

టెస్టుల‌కు రిటైర్మెంట్ పలికిన ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్.. మున్ముందు బిగ్‌బాష్ లీగ్‌లో అలరించనున్నాడు. సిడ్నీ థండర్స్ తరుపున బరిలోకి దిగనున్నాడు. శుక్రవారం (జ‌న‌వ‌రి 12)  సిడ్నీ క్రికెట్ గ్రౌండ్(ఎస్‌సిజి) వేదికగా సిడ్నీ సిక్సర్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో డేవిడ్ భాయ్ ఆడనున్నాడు. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు వార్నర్ హాలీవుడ్ హీరో రేంజ్‌లో హెలిక్యాప్టర్‌లో మైదానంలో అడుగుపెట్టనున్నాడు.        

సిడ్నీ సిక్సర్స్‌- సిడ్నీ థండర్స్ మ్యాచ్ జరగాల్సిన జ‌న‌వ‌రి 12న ఉద‌యం హంట‌ర్ హ్యలీ ప్రాంతంలో వార్నర్ సోద‌రుడి పెండ్లి జరగనుంది. ఈ ప్రాంతం మ్యాచ్ జరగాల్సిన సిడ్నీ గ్రౌండ్‌కు దాదాపు 250 కిలోమీట‌ర్ల దూరం. దీంతో వివాహానికి హాజరైన అనంతరం వార్నర్ ప్రైవేట్ హెలిక్యాప్టర్‌లో సిడ్నీకి బ‌య‌లుదేర‌నున్నాడు. ప్రేక్షకులు స్టేడియంలోకి అనుమ‌తించ‌డానికి ముందే అత‌డు ఎస్‌సిజి అవుట్‌ఫీల్డ్‌లోకి దిగుతాడని సీడ్నీ థండ‌ర్స్ ఒక ప్రక‌టన‌లో తెలిపింది.

మూడు మ్యాచ్‌లు

లీగ్ దశలో సీడ్నీ థండ‌ర్స్ ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సివుండగా.. ఈ మూడింటిలో వార్నర్ ఆడనున్నాడు. అనంత‌రం డేవిడ్ భాయ్ దుబాయ్ వేదికగా జరిగే ఇంట‌ర్నేష‌న‌ల్ టీ20 లీగ్ కోసం యూఏఈ వెళ్లనున్నాడు.