మళ్లీ కొట్టాడు : బంగ్లాతో మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ సెంచరీ

మళ్లీ కొట్టాడు : బంగ్లాతో మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ సెంచరీ

వరల్డ్ కప్ 2019లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరో సెంచరీ కొట్టాడు. నాటింగ్ హామ్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో ఈ ఆస్ట్రేలియా ఓపెనర్ రెచ్చిపోయి ఆడాడు. 112 బాల్స్ లో సెంచరీ పూర్తిచేశాడు. ఓపెనర్ ఫించ్(53) తో కలిసి తొలి వికెట్ కు 121 రన్స్ భాగస్వామ్యం అందించిన వార్నర్.. ఖవాజాతో కలిసి ఆస్ట్రేలియా స్కోరు బోర్డును పరుగెత్తించాడు.

నిషేధం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న వార్నర్.. తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. ఈ టోర్నమెంట్ లో ఇది రెండో సెంచరీ. ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు వార్నర్ ఖాతాలో ఉన్నాయి.