డీజే, బ్యాండ్​ వాయిస్తే నిఖా జరిపించొద్దు

డీజే, బ్యాండ్​ వాయిస్తే నిఖా జరిపించొద్దు

ఘజియాబాద్: డీజే, బ్యాండ్​ వాయిస్తే నిఖా జరిపించొద్దని ఉత్తరప్రదేశ్​లోని ఘజియాబాద్ ​ముస్లిం మహాసభ మత గురువులకు సూచించింది. ముస్లింల వివాహ వేడుకను సాదాసీదాగా జరిపించాలని, ఇందుకు సంఘాలను ఒప్పించేందుకు మత గురువులు సహకరించాలని గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.

పెండ్లికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయడాన్ని సంస్థ ఎప్పుడూ వ్యతిరేకిస్తుందని పేర్కొంది. ఇక ముందు ​డీజే కల్చర్‌‌ ను ఎంకరేజ్​ చేయబోమని ఆ ఫ్యామిలీల నుంచి లిఖితపూర్వక హామీ కూడా తీసుకోవాలని సూచించింది. జార్ఖండ్‌‌లోని ధన్‌‌బాద్ జిల్లాలో పెండ్లిల టైంలో డ్యాన్స్​లు, పెద్ద సౌండ్ ప్లే చేయడం, పటాకులు పేల్చడం వంటివాటిని​ముస్లిం మత పెద్దలు ఇదివరకే బ్యాన్​ చేశారు.