పంజాగుట్ట, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం ప్రతినిధులు కల్యాణ్, హరీశ్, అభ్యర్థులతో కలిసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నాలుగు సార్లు టెట్ నిర్వహించిందని, డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
డీఎస్సీ కోసం వేలాది మంది ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చొరవ తీసుకొని డీఎస్పీ నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో నిరుద్యోగ అభ్యర్థులు పాండు, సాయి, వెంకట్, మౌనిక, సరౌని, గిరి, పవన్, మహేశ్‌నాయక్, తదితరులు పాల్గొన్నారు.
