సీజన్‌‌‌‌‌‌‌‌ తొలి గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌‌‌‌‌ ఆస్ట్రేలియన్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో జొకోవిచ్‌‌‌‌‌‌ బోణీ

సీజన్‌‌‌‌‌‌‌‌ తొలి గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌‌‌‌‌ ఆస్ట్రేలియన్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో జొకోవిచ్‌‌‌‌‌‌ బోణీ

మెల్‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌: సెర్బియా స్టార్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌, డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌ నొవాక్‌‌‌‌‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌‌‌‌‌.. సీజన్‌‌‌‌‌‌‌‌ తొలి గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌‌‌‌‌ ఆస్ట్రేలియన్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో బోణీ చేశాడు. ఆదివారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌సీడ్‌‌‌‌‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌‌‌‌‌ 6–2, 6–7 (5/7), 6–3, 6–4తో క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌ డినో ప్రిజ్మిక్‌‌‌‌‌‌‌‌ (క్రొయేషియా)పై పోరాడి గెలిచాడు. 4 గంటల 1 నిమిషం పాటు జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 24 గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌‌‌‌‌ విన్నర్‌‌‌‌‌‌‌‌ జొకోకు ప్రిజ్మిక్‌‌‌‌‌‌‌‌ గట్టి పోటీ ఇచ్చాడు.

సాధారణంగా గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌‌‌‌‌ తొలి రౌండ్స్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను జొకో మూడు సెట్లలోనే ముగిస్తాడు. కానీ ప్రిజ్మిక్‌‌‌‌‌‌‌‌ కొట్టిన బ్యాక్‌‌‌‌‌‌‌‌హ్యాండ్‌‌‌‌‌‌‌‌ షాట్లకు గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ మొత్తం పరుగెత్తిన సెర్బియన్‌‌‌‌‌‌‌‌ రెండో సెట్‌‌‌‌‌‌‌‌ను టైబ్రేక్‌‌‌‌‌‌‌‌లో చేజార్చుకున్నాడు. కీలకమైన నాలుగో సెట్‌‌‌‌‌‌‌‌లోనూ 0–4తో వెనకబడిన 18 ఏళ్ల ప్రిజ్మిక్‌‌‌‌‌‌‌‌ ఓ బ్రేక్‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌ను కాచుకుని తర్వాత సర్వీస్‌‌‌‌‌‌‌‌ను నిలబెట్టుకున్నాడు. దీంతో 3–5తో పోటీ ఇచ్చినా జొకో రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ పాయింట్లను కాచుకుని విన్నర్‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు.

ఇతర మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో జానిక్‌‌‌‌‌‌‌‌ సినెర్‌‌‌‌‌‌‌‌ (ఇటలీ) 6–4, 7–5, 6–3తో వాన్‌‌‌‌‌‌‌‌ డి జాండ్‌‌‌‌‌‌‌‌స్కల్ప్‌‌‌‌‌‌‌‌ (నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌)పై, ఆండ్రీ రబ్లెవ్‌‌‌‌‌‌‌‌ (రష్యా) 7–5, 6–4, 3–6, 4–6, 7–6 (10/6)తో సైబోథ్‌‌‌‌‌‌‌‌ విల్డ్‌‌‌‌‌‌‌‌ (బ్రెజిల్‌‌‌‌‌‌‌‌)పై, ఫ్రిట్జ్‌‌‌‌‌‌‌‌ (అమెరికా) 4–6, 6–3, 3–6, 6–2, 6–4తో డియాజ్‌‌‌‌‌‌‌‌ అకోస్టా (అర్జెంటీనా)పై గెలిచి రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌లోకి అడుగుపెట్టారు. విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌లో రెండోసీడ్‌‌‌‌‌‌‌‌ అరీనా సబలెంక (బెలారస్‌‌‌‌‌‌‌‌) 6–0, 6–1తో సిడెల్‌‌‌‌‌‌‌‌ (స్పెయిన్‌‌‌‌‌‌‌‌)పై, మరియా సకారీ (గ్రీస్‌‌‌‌‌‌‌‌) 6–4, 6–1తో హిబినో (జపాన్‌‌‌‌‌‌‌‌)పై, క్రెజీకోవా (చెక్‌‌‌‌‌‌‌‌) 2–6, 6–4, 6–3తో హోంటమా (జపాన్‌‌‌‌‌‌‌‌)పై, అనిసిమోవా (అమెరికా) 6–3, 6–4తో సమ్సనోవా (రష్యా)పై, డియానె పారీ (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌) 6–3, 2–6, 6–3తో వాంగ్‌‌‌‌‌‌‌‌ (చైనా)పై గెలిచి ముందంజ వేశారు.