షిఖోపూర్ ల్యాండ్ డీల్, మనీ లాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ కోర్టు. ఈ కేసుకు సంబంధించి శనివారం ( మే 16 ) విచారణ జరిపిన కోర్టు రాబర్ట్ వాద్రాకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ బాండ్ దాఖలు చేయాలని కోరిన కోర్టు షరతులేమీ లేకుండానే బెయిల్ మంజూరు చేసింది.
షికోపూర్ ల్యాండ్ డీల్ మనీలాండరింగ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం, రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ, "నేను ఈ దేశ న్యాయ వ్యవస్థను నమ్ముతానని... ఈడీని ప్రభుత్వం నడుపుతోందని, ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈడీ ముందుకు సాగుతుందని నాకు తెలుసని అన్నారు.
ALSO READ : బండి భగీరథ్కు లుకౌట్ నోటీసులు..
తాను ఎప్పుడు విచారణకు రమ్మంటే అప్పుడు వచ్చి హాజరవుతానని స్పష్టం చేశారు. ఈ కేసును ఎదుర్కునే సామర్థ్యం ఉందని..నిర్భయంగా ఉన్నానని అన్నారు వాద్రా.హర్యానాలోని షికోపూర్‌లో జరిగిన ల్యాండ్ డీల్ కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ట్రయిల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ రాబర్ట్ వాద్రా ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం వ్యతిరేకించింది.
