ఆర్టీసీ బస్సులో దారుణం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న బాలికను ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండెక్టర్ ఆమెను బలవంతంగా బస్సులో నుంచి బయటకు తోశారు. దీంతో బాలిక ప్రాణాలు కోల్పోయింది.
టైమ్స్ న్యూస్ నౌ కథనం ప్రకారం..ఉత్తర్ ప్రదేశ్ కు షికోహబాద్ కు చెందిన బాలిక కుటుంబం గత రెండేళ్లుగా ఢిల్లీలోని మాండవాలిలో నివాసం ఉంటుంన్నారు. అయితే కరోనా వైరస్ కారణంగా సొంతరాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ షికోహాబాద్ కు వచ్చేందుకు ఆమె కుటుంబం తిరుగు ప్రయాణమైంది.ఢిల్లీ నుంచి ఉత్తర్ ప్రదేశ్ కు వచ్చేందుకు యూపీఎస్ ఆర్టీసీ బస్సు ఎక్కారు. బస్సు ప్రయాణంలో ఉండగా యమునా ఎక్స్ ప్రెస్ వేలో బస్సు డ్రైవర్ అనారోగ్యంతో బాధపడుతున్న బాలికకు కరోనా వైరస్ సోకిందంటూ బస్సులో నుంచి బయటకు తోశారు. దీంతో బాధితురాలు గుండె పోటుతో మరణించింది.
కుటుంబసభ్యుల సమాచారంతో కేసు నమోదు చేసుకున్న మథుర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో సహజ మరణంతో బాధితురాలి మరణించినట్లు తేల్చారు.
తన సోదరిది సహజ మరణం అయితే కరోనా వైరస్ సోకిందని యూపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ బస్సులో నుంచి బయటకు తోసేశారని, తన తల్లి వేడుకుంటున్న ఆమె మొహం పై ఉన్న దుప్పటిని తీసేసే బయటకు బలవంతంగా నెట్టారని బాధితురాలి సోదరుడు విపిన్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన సోదరికి న్యాయం చేయాలని కోరుతూ విపిన్ యాదవ్ ఢిల్లీ మహిళా కమిషన్ ను కోరాడు. విపిన్ కోరిక మేరకు బాధితురాలి మరణం విషయంలో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని మథుర ఎస్ఎస్ఎస్పీ గౌరవ్ ను ఆదేశించారు. దీంతో విచారణ చేపట్టిన ఎస్ఎస్ఎస్పీ గౌరవ్ బాధితురాలిది, సహజ మరణమేనని, బస్సులో నుంచి నెట్టడం వల్ల గుండెపోటుతో మరణించినట్లు గుర్తించారు. బాధితురాలి మరణానికి కారణమైన యూపీఎస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుంటామని పోలీస్ అధికారులు తెలిపారు.
