RT-PCR టెస్ట్ ధరలు తగ్గించిన ఢిల్లీ ప్రభుత్వం

RT-PCR టెస్ట్ ధరలు తగ్గించిన ఢిల్లీ ప్రభుత్వం

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా టెస్టులకు సంబంధించి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు ల్యాబ్ ల్లో RT-PCR టెస్టుల ధరలను భారీగా తగ్గించింది. ఇందులో భాగంగా నగరంలోని అన్ని ప్రైవేటు లేబొరేటరీలకు సోమవారం ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫ్రీగా పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ.. ప్రైవేటు ల్యాబ్ ల్లో మాత్రం ఒక్కో టెస్టుకు రూ.2,400 చొప్పున వసాలు చేస్తున్నారు. అయితే…దీన్ని రూ.800లకు తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఒకవేళ ఇంటికి వచ్చి శాంపిల్స్ సేకరిస్తే అందుకు రూ.1,200లుగా ధరను నిర్ణయించింది. 24గంటల్లో అన్ని లేబొరేటరీలు, ఆస్పత్రుల్లో సవరించిన ధరలను బోర్డుల్లో డిస్ప్లే చేయాలని ఆదేశించింది. ప్రైవేటు లేబొరేటరీలు సేకరించిన శాంపిల్స్, రిపోర్డులకు సంబంధించిన వివరాలను ICMR పోర్టల్లో అప్డేట్ చేయాలని సూచించింది.

కరోనా వ్యాప్తి ఎక్కువ కావడంతో ప్రైవేట్ ల్యాబ్ ల్లో టెస్టులు చేయించుకునే ప్రజల సంఖ్య పెరిగింది. అయితే అది వారిపై భారం పడకూడదనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సీఎం కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.