ఢిల్లీ మున్సిపల్ మేయర్ ఎన్నిక వాయిదా

ఢిల్లీ మున్సిపల్ మేయర్ ఎన్నిక వాయిదా

ఢిల్లీ మున్సిపల్ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. ఆమ్ ఆద్మీ పార్టీ , BJP సభ్యుల మధ్య ఘర్షణ జరగడంతో మేయర్ ఎన్నిక వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్  తదుపరి నోటీసు వచ్చే వరకు ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయించారు. కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అరవింద్ కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకుని నినాదాలు చేశారు. 


ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ VK సక్సేనా నియమించిన తాత్కాలిక స్పీకర్ సత్య శర్మ, మేయర్ ఎన్నికకు ముందు సభకు నామినేటెడ్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడంపై గందరగోళం నెలకొంది. ఎన్నికైన సభ్యులను కాకుండా నామినేటెడ్ సభ్యులను ఎలా ముందుగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ సభ్యులు ఆందోళనకు దిగారు. మనోజ్ కుమార్‌ను ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానించడంతో కౌన్సిలర్లు నినాదాలు చేశారు. తమ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా లెఫ్టినెంట్ గవర్నర్ 10 మంది నామినేటెడ్ సభ్యుల పేర్లను పేర్కొనడంపై ఆప్ అభ్యంతరం తెలిపింది.