ఓ కంపెనీ రకరకాల సబ్బులు తయారు చేస్తోంది. కోట్ల సంఖ్యలో అమ్ముతోంది. కొత్తగా ఇంకో సబ్బును మార్కెట్లోకి తేవాలి. అది సక్సెస్ కావాలంటే.. ఏ వయసువారు, ఏ వృత్తిలో ఉన్నవారు, ఎంతెంత ఖర్చు పెట్టేవారు, ఏ రకమైన సబ్బును ఇష్టపడతారో తెలుసుకుని తయారు చేయాలి. మరి ఈ పని ఎవరు చేసి పెట్టాలి? డేటా అనలిస్టులే. అప్పటిదాకా మార్కెట్లో ఉన్న రకరకాల ఉత్పత్తులను వయసు, వృత్తి, ఖర్చు పెట్టే స్థాయి, ఇష్టాల ఆధారంగా విశ్లేషించి.. ఇప్పుడు ఎలా తెస్తే బాగుంటుందో చెప్పేది వారే. ఇదంతా డేటా సైన్స్. ఇప్పుడు మన రాష్ట్రంలో, ఏపీలో సంచలనంగా మారిన ఓటర్ల డేటా చోరీ వ్యవహారం కూడా ఇలా డేటా సైన్స్‌తో ముడిపడి ఉన్నదే. ఓటర్ల ప్రాంతం, నియోజకవర్గం, ఊరు, కులం, వయసు, ఏ పార్టీ మద్దతుదారు అన్న వివరాలను డేటా అనలైజేషన్ ద్వారానే విశ్లేషించి, ఏ ఓటరుకు సంబంధించి ఎలా వ్యవహరిం చాలన్నది నిర్ణయించుకుంటారు. ఇదే కాదు.. పొద్దున లేవగానే వాడే బ్రష్ దగ్గరి నుంచి రాత్రి నిద్రపోయే బెడ్ దాకా అన్నింటి తయారీ కంపెనీలు డేటా అనలిస్టులపై ఆధారపడతాయి. అందుకే వీరికి మరింతగా డిమాండ్ పెరిగిపోతోంది. భవిష్యత్తులో డేటా అనలిస్ట్ ఓ ప్రత్యేక ప్రొఫెషన్ గా మారిపోనుంది.
ఇంజనీర్ , డాక్టర్ , పైలట్, చార్టర్డ్ అకౌంటెం ట్, యాప్ డెవలపర్ వంటి అట్రాక్టివ్ జాబ్స్ జాబితాలో ఇప్పుడు మరో ప్రొఫెషన్ వచ్చి చేరింది. అదే డేటా అనలిస్ట్. జాబ్ వర్క్‌ను బట్టి బిజినెస్ అనలిస్ట్, ప్రొడక్ట్ అనలిస్ట్, రీసెర్చ్ అనలిస్ట్, డేటా అనలిస్ట్, స్టాటిస్టి కల్ అనలిస్ట్, హడూప్ డెవలపర్ అని వేర్వేరు పేర్లతో పిలుస్తున్నా.. వాళ్లంతా డేటా అనలిస్ట్‌లే. ప్రపంచంలోని ప్రముఖ సంస్థలు, కంపెనీలన్నీ ఈ అనలిస్టుల కోసం ఎదురుచూస్తున్నాయి. మన దేశంలో ఈ ఏడాది సుమారు లక్ష వరకు డేటా అనలిస్ట్ ఉద్యోగాలు ఖాళీగా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 25 లక్షలని అంచనా.
ఫుల్లు డిమాండ్
ఇప్పుడు పనులన్నీ ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. ఎవరైనా తమ అవసరాలు, సందేహాల కోసం నెట్ లో వెతుకుతున్నారు . మనం సెర్చ్ చేసే వెబ్ సైట్ మన ఇష్టాఇష్టాలను వెంటనే పట్టేస్తుంది. దాన్నిబట్టే మనకు యాడ్స్ కూడా చూపిస్తుంటుం ది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ). డేటా అనలిస్టులు ఇలాంటి ఏఐని వినియోగించి డేటాను విశ్లేషిస్తారు. వారిచ్చే రిపోర్ట్ ఆధారంగానే కంపెనీలు తమ ఉత్పత్తులపై నిర్ణయం తీసుకుంటాయి. పెద్ద పెద్ద కంపెనీలైతే వందలాది మంది డేటా అనలిస్టులను నియమించుకుంటున్నాయి. ఇటీవల అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ , ఎడ్ టెక్ కంపెనీ గ్రేట్ లెర్నిం గ్ నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం.. ప్రస్తుతం మన దేశంలోనే సుమారు లక్ష డేటా అనలిస్ట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2.5 మిలియన్ ఉద్యోగాలు ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఉద్యోగాల సంఖ్య 45 శాతం పెరిగింది. ఈ ఏడాది యాక్సెంచర్, అమెజాన్, కేపీఎంజీ, హనీవెల్, వెల్స్ ఫార్గో, ఎర్నస్ట్ అండ్ యంగ్ వంటి వివిధ మల్టీనేషనల్ కంపెనీల నుంచే డేటా అనలిస్ట్‌లకు 60 శాతం డిమాండ్ ఉన్నట్టు అధ్యయనంలో తేలిం ది. బ్యాంకిం గ్ , ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్, ఎనర్జీ అండ్ యుటిలి టీస్, ఈ-కామర్స్, మీడియా అండ్ ఎంటర్టైన్మెం ట్, రిటైల్, ఆటోమొబైల్ రంగాల్లో ఉద్యోగాలున్నాయి. దేశంలో డేటా అనలిస్టులను అత్య ధికంగా హైర్ చేసుకున్న నగరాల్లో బెంగళూర్ ప్రథమ స్థానంలో ఉండగా, హైదరాబాద్ ఐదో స్థానంలో నిలిచింది.
ఎందుకీ అనలిటిక్స్?
డేటా అనాలసిస్ అంటే – అల్గా రిథం, టూల్స్, మెషీన్ లెర్నింగ్ మెథడ్‌లను అన్వయించుకుంటూ.. కుప్పగా ఉన్న డేటాలో నుంచి అవసరమైన ఫలితాలను రాబట్టడం. డేటా రూపంలోని స్టాటిస్టిక్స్‌కు విశ్లేష ణను అన్వయించి, కచ్చి తమైన ఫలితాలను ఆవిష్కరిం చడమే డేటా అనలిస్ట్‌ల పని. ఉదాహరణకు ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో రకరకాల ఏజ్ గ్రూప్‌ల వాళ్లు వేలాది మంది పాలసీలు తీసుకుంటుంటారు. ఇందులో ఏజ్ గ్రూప్‌లను బట్టి కొందరు కొన్ని రకాల పాలసీలపై ఎక్కువ ఆసక్తి కనబరచగా, మరికొందరు మరో రకమైన పాలసీలో చేరేందుకు ఇష్టపడతారు. పాలసీదారుల ఏజ్ గ్రూప్, చేసే వృత్తి, వారి నేపథ్యం , చెల్లించే ప్రీమియం తదితర వివరాలను డేటా అనలిస్టులు విశ్లేషిస్తారు. ఆ ఫలితాల ఆధారంగా సదరు ఇన్సూరెన్స్ కంపెనీ భవిష్యత్ లో ఎలాంటి కొత్త స్కీమ్‌లు రూపొందించవచ్చనేది సూచనలను గ్రాఫికల్‌గా చూపిస్తారు.
కొత్త కోర్సులు రెడీ..
డేటా అనలిస్టులకు డిమాండ్ పెరిగిపోతుండటంతో విద్యాసంస్థలన్నీ దీనిపై కోర్సులు ప్రవేశపెడుతున్నాయి. ఇప్పటికే విదేశాల్లో యూనివర్సిటీలు డేటాసైన్స్ కోర్సులు నడుపుతున్నాయి. మన దేశంలోనూ ఐఐటీలు, ఇంజనీరింగ్ కోర్సులు అందిం చే యూనివర్సిటీలు కోర్సులను డిజైన్ చేస్తున్నాయి. బీటెక్, బీఎస్సీలో డేటా సైన్స్ కాంబినేషన్ తో కూడిన కోర్సులు రాబోతున్నాయి. హైదరాబాద్ ఐఐటీలో ఎంటెక్ డేటా సైన్స్(ఎండీఎస్), ఎగ్జిక్యూటివ్ ఎంటెక్ డేటా సైన్స్ (ఈఎండీఎస్) కోర్సులకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల కాగా, జేఎన్టీయూ ఎంటెక్ డేటా సైన్స్ కోర్సుకు రూపకల్పన చేస్తోంది. ఉస్మా నియా వర్సిటీ గతేడాదే సర్టిఫికెట్ కోర్సు ప్రారంభించింది. చాలా ప్రైవేటు కోచింగ్ సెంటర్లు ఆన్ లైన్ , ఆఫ్‌లైన్ మోడ్ లో డేటా అనలిటిక్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
ఎవరెవరు అర్హులు
బీఎస్సీ (స్టాటిస్టిక్స్), బీటెక్, కంప్యూటర్ సైన్స్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్‌తో డిగ్రీ చేసినవారు డేటా అనాలసిస్ కోర్సులు చేయొచ్చు. అయితే డేటాసైన్స్‌లో ఉండే ప్రోగ్రామింగ్, స్టాటిస్టిక్స్ అంశాలు బీఎస్సీ (స్టాటిస్టిక్స్)లో కూడా ఉండడం వల్ల వారికి మాత్రం కొంత సులువుగా ఉంటుంది. వివిధ ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ స్టాటిస్టిక్స్ మీద ఆసక్తి ఉంటే ఈ నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. డేటాను కన్సాలి డేట్ చేసేందుకు అవసరమైన పైథాన్ , ఆర్ టూల్స్‌తోపాటు టేబుల్యూ, ఏడబ్ల్ యూఎస్, అజూర్ , హడూప్, ఎస్‌క్యూ ఎల్, సెగ్మెంటేషన్ టూల్స్ నేర్చుకుంటే అనలిస్టు లుగా రాణించవచ్చు. ఈ కోర్సులను నేర్చుకుంటే మాత్రమే సరిపోదని, ఏ రంగానికి చెందిన డేటాను అనలైజ్ చేస్తారో
ఆ రంగంపై సమగ్ర అవగాహన కలిగి ఉండటం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
