ఆధ్యాత్మికం:కామద ఏకాదశి(మార్చి 29).. ఇవి దానం చేయండి. పాపాలు పోతాయి.. ఐశ్వర్యం.. సంతానం వృద్ది

ఆధ్యాత్మికం:కామద ఏకాదశి(మార్చి 29).. ఇవి దానం చేయండి. పాపాలు పోతాయి.. ఐశ్వర్యం.. సంతానం వృద్ది

హిందూ ధర్మంలో ఏకాదశికి ప్రత్యేక విశిష్టత ఉంది.  పురాణాల ప్రకారం ఏకాదశి విష్ణుమూర్తికి అంకితం చేయబడింది.  ప్రతి నెలలో రెండు ఏకాదశులు వచ్చినా.. ప్రతి ఏకాదశికి ప్రాముక్యత.. విశిష్టత వేరు వేరుగా ఉంటుంది. తెలుగు సంవత్సరం.. తొలి మాసం.. చైత్రమాసం శుద్ద ఏకాదశిని కామద ఏకాదశి అంటారు.   ఈఏడాది  మార్చి 29 న కామిక ఏకాదశి వచ్చింది. ఈ రోజు కొన్ని పరిహారాలు పాటించి విష్ణుమూర్తిని పూజిస్తే  పాపాలు హరించి..ఐశ్వర్యం.. సంతానం  వృద్ది జరుగుతుందని పండితులు చెబుతున్నారు.   మార్చి 29 ఆదివారం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. . .! 

కామిక ఏకాదశి ( 2026 మార్చి 29)  విష్ణుమూర్తిని పూజిస్తే.. ఆయన అనుగ్రహం మెండుగా లభిస్తుందని భక్తులు నమ్ముతారు కామద ఏకాదశి ఉపవాస వ్రతం.. బ్రహ్మహత్య వంటి దారుణ పాపాల నుంచి కూడా విముక్తిని ఇస్తుందంటున్నారు పండితులు. ఇంతటి ప్రాధాన్యత కలిగి ఉంది. 

కామద ఏకాదశి తిథి వివరాలు

  • కామిక ఏకాదశి తిథి ప్రారంభం:  మార్చి 28వ తేదీ ఉదయం 08:45 గంటలు
  • కామిక ఏకాదశి తిథి ముగింపు:  మార్చి 29 ఉదయం 07:46 గంటలకు వరకు
  • ఉదయ తిథి ప్రకారం.. మార్చి 29న కామద ఏకాదశి వ్రతం పాటిస్తారు. మార్చి 30, సోమవారం ఉదయం 6:14 నుంచి 7:09 గంటల మధ్య వ్రతాన్ని విరమించాలని పండితులు చెబుతున్నారు. 

ఏకాదశి ఉపవాసానికి చాలా  ప్రాముఖ్యత ఉంది. కామద ఏకాదశిని చైత్ర మాసంలోని శుక్ల పక్షం ఏకాదశి తిథి నాడు పాటిస్తారు. ఉపవాసంతో పాటు, ఈ రోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. పండితులు తెలిసిన వివరాల ప్రకారం.. కామద ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణుదేవుడిని పూజించడం వల్ల తెలిసిగానీ, తెలియకగానీ చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. దైవ ఆశీస్సులు లభిస్తాయి. ఉపవాసం, పూజలతో పాటు, కామద ఏకాదశి నాడు దానధర్మాలు కూడా చేస్తారు. మనస్సాక్షితో ఉపవాసం పాటించినా లేదా దానధర్మాలు చేసినా..పాపాలు తొలగి..  తీరని కోరికలన్నీ నెరవేరి, ఇంట్లో సంపద, ఐశ్వర్యంతో పాటు సంతానం వృద్ది చెందుతుందని పండితులు చెబుతున్నారు. 

ఏమేమి దానం చేయాలంటే. ..

  •  మట్టి కుండలో నీరు నింపి దానం చేయడం ఉత్తమం.
  •  గోధుమలు, బియ్యం , పుచ్చకాయ, మామిడి వంటి సీజన్​ ఫ్రూట్స్​ 
  • పేదలకు గొడుగు ,  చెప్పులు.. బూట్లు 
  • పేద విద్యార్థులకు పుస్తకాలు.. పెన్నులు 
  • బ్రాహ్మణులకు వస్త్రదానంతో పాటు దక్షిణ తాంబూలం

కామద ఏకాదశి రోజు  ( 2026 మార్చి 29) కొన్ని చర్యలు ఆచరించడం వల్ల జీవితంలో దేనికి లోటు ఉండదు. సమస్యలన్నీ తొలగిపోతాయి. కామద ఏకాదశి రోజు తప్పనిసరిగా విష్ణుమూర్తిని ఆరాధిస్తారు. అలాగే శమీ మొక్కని పూజించాలి. పిండి దీపం వెలిగించి అందులో కర్పూరం, పసుపు వేయాలి. ఇలా చేయడం వల్ల ఎంతో కాలంగా నిలిచిపోయిన ధనం తిరిగి మీ చేతికి అందుతుంది. గ్రహాల శుభ ప్రభావం మీ మీద ఉంటుందని పండితులు చెబుతున్నారు

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను  వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  సమస్యలకు  నిపుణులను సంప్రదించటం ఉత్తమం..