మున్సిపల్ ఎన్నికలకు 25 వేల మంది పోలీసులతో బందోబస్తు.: డీజీపీ శివధర్ రెడ్డి

మున్సిపల్ ఎన్నికలకు   25 వేల మంది పోలీసులతో బందోబస్తు.: డీజీపీ శివధర్ రెడ్డి

రేపు( ఫిబ్రవరి 11)జరబోయే  మున్సిపల్ ఎన్నికలకు 25 వేల మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్టు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.8189 పోలింగ్ స్టేషన్లు ..133 కౌంటింగ్ స్టేషన్లు సిద్ధం చేశామని వెల్లడించారు. 53లక్షల 43 వేల మంది ఓటర్లకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.  పార్టీ  బేస్ గా జరుగుతున్న ఎన్నికలు కావడంతో భద్రత పెంచామని చెప్పారు డీజీపీ. ఓటర్లు నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయొచ్చన్నారు.  ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేస్తామన్నారు.

హైపర్ సెన్సిటీవ్ పోలింగ్ కేంద్రాల్లో బయట కూడా వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు డీజీపీ.   సీసీ కెమెరాలతో పటిష్ట  నిఘా ఏర్పాటు చేశామన్నారు. నిభంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు  తీసుకుంటామన్నారు. 1183 లైసెన్స్ వెపన్స్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. 4800 మంది బైండోవర్ చేశామని.. 2900 మంది రౌడీ షీటర్లు ఉన్నారని చెప్పారు.  మక్తల్ ఆరో వార్డు బీజేపీ అభ్యర్థి మృతిపై దర్యాప్తు జరుగుతోందన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. ఫోరెన్స్ ల్యాండ్ ఫైర్ యాక్సిడెంట్ లో కీలక డేటా పోలేదన్నారు.కొంత మంది ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని చెప్పారు.

 రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు..7 కార్పొరేషన్లకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 13న కౌంటింగ్ జరగనుంది. 15న మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లు ఎంపిక ఉండనుంది.