మాదాపూర్ శిల్పకళా వేదికలో ధన్య ప్రసాద్ కూచిపూడి నృత్య రంగప్రవేశం అలరించింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ముఖ్య అతిథులుగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేశారు. పద్మభూషణ్ రాజారెడ్డి డా.-రాధారెడ్డి దంపతులు, గురువులు కౌసల్యా రెడ్డి, యామిని రెడ్డిల సమక్షంలో ధన్య ఈ ప్రదర్శన ఇచ్చింది.
- మాదాపూర్, వెలుగు
