ఓయూలో విద్యార్థి సంఘ నాయకుల ధర్నా

ఓయూలో విద్యార్థి సంఘ నాయకుల ధర్నా

రాష్ట్రంలో అన్ని నోటిఫికేషన్ లు ఒకేసారి వేయడం వల్ల నిరుద్యోగులు అయోమయానికి గురయ్యే పరిస్థితి నెలకొందని నిరుద్యోగ సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని ఓయూ ఆర్ట్స్ కళాశాల దగ్గర ధర్నా చేపట్టారు. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని సంబరాలు చేసుకోవాలా.. లేక ఒక పరీక్ష తరువాత ఇంకొక పరీక్ష నిర్వహించబోతున్నారని బాధ పడాలా అని నిరుద్యోగ విద్యార్థి సంఘ నాయకులు వాపోయారు. దీనివల్ల విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారని తెలిపారు. 

గురుకులాల, జెల్, గ్రూప్ 2, టెట్ ఇలా ఒక పరీక్ష తరువాత ఒక పరీక్ష పెట్టడం వల్ల.. విద్యార్థులకు ప్రిపేర్ అయ్యే సమయం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పరీక్ష తర్వాత ఇంకొక పరీక్షకు కనీసం రెండు నెలల వ్యవధి ఉండాలని కోరారు. నిరుపేద విద్యార్థులు వేలకు వేలు పెట్టి కోచింగ్ సెంటర్లకు వెళ్లి.. కోచింగ్ తీసుకుంటే తీరా పరీక్షల సమయంలో విద్యార్థిలను మానసికంగా కుంగిపోయేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లోనే పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు.