వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ స్టేజ్‌‌‌‌–3లో ఫైనల్లో ధీరజ్‌‌‌‌–కుంకుమ్‌‌‌‌

వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ స్టేజ్‌‌‌‌–3లో ఫైనల్లో ధీరజ్‌‌‌‌–కుంకుమ్‌‌‌‌

అంటాల్యా (టర్కీ): ఇండియా స్టార్‌‌‌‌ ఆర్చర్లు ధీరజ్‌‌‌‌ బొమ్మదేవర–కుంకుమ్‌‌‌‌ మొహోద్‌‌‌‌ జోడీ.. వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ స్టేజ్‌‌‌‌–3లో ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన రికర్వ్‌‌‌‌ మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ టీమ్‌‌‌‌ సెమీస్‌‌‌‌లో మూడోసీడ్‌‌‌‌ ధీరజ్‌‌‌‌–కుంకుమ్‌‌‌‌ 6–2తో కెటరీనా బాయర్‌‌‌‌–మోరిట్జ్‌‌‌‌ వీజర్‌‌‌‌ (జర్మనీ)పై గెలిచారు. అంతకుముందు డెన్మార్క్‌‌‌‌, అమెరికాను చిత్తుగా ఓడించిన ఇండియా సెమీస్‌‌‌‌లోనూ అదే ఫామ్‌‌‌‌ను కొనసాగించింది.

మెన్స్‌‌‌‌, విమెన్స్‌‌‌‌ రికర్వ్‌‌‌‌ టీమ్స్‌‌‌‌ మాత్రం ఘోరంగా ఫెయిలయ్యాయి. జట్టు ఎంపికలో అనుసరించిన వివాదాస్పద విధానం కారణంగా పతకాలు సాధించలేకపోయారు. విమెన్స్‌‌‌‌ రికర్వ్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌ఫైనల్లో కీర్తి శర్మ–అంకితా భాకట్‌‌‌‌తో కూడిన ఇండియా 1–5తో టర్కీ చేతిలో ఓడింది. మెన్స్‌‌‌‌ రికర్వ్‌‌‌‌ టీమ్‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌లోనే వెనుదిరిగింది.