- ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్
రవీంద్రభారతి, వెలుగు: బంజారా సమాజ చరిత్ర, సంస్కృతి, అస్తిత్వం, సాహిత్య పరిరక్షణకు డాక్టర్ ధనుంజయ్నాయక్మూడ్రచించిన ధూళి చక్రాలు, ది వీల్స్ ఆఫ్ డస్ట్, రిఫ్లెక్షన్స్ ఆఫ్ బంజారా గ్రంథాలు విశిష్ట సేవలందిస్తాయని ప్రభుత్వ విప్జాటోత్ రామచంద్రునాయక్అన్నారు. వాటిని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, బంజారా సాహిత్య అకాడమీ(హైదరాబాద్) సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో ఆవిష్కరించారు. రచయిత ధనంజయ్ నాయక్‌ను అభినందించారు.
మాజీ ఎంపీ సీతారాం నాయక్, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ.. బంజారా సంప్రదాయాలు, చరిత్ర, వారసత్వాన్ని గ్రంథ రూపంలో తీసుకువచ్చిన ధనంజయ్ కృషిని ప్రశంసించారు. డాక్టర్రమేశ్ఆర్య మాట్లాడుతూ.. బంజారా సాహిత్య చరిత్రలో ధూళిచక్రాలతో ధనంజయ్ నాయక్ ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించారన్నారు. డాక్టర్పత్తిపాక మోహన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్సూర్య ధనంజయ్, ఓయూ ప్రొఫెసర్ ఎస్.రఘు, బంజారా సాహిత్య అకాడమీ కార్యనిర్వాహక కార్యదర్శి రమేశ్, సాహితీవేత్తలు, రచయితలు, పరిశోధకులు పాల్గొన్నారు.
