ఇండియన్ బాక్సాపీస్ వద్ద సంచలన విజయం అందుకున్న ‘ధురంధర్: ది రివేంజ్’ చిత్రం ఇప్పుడు అంతర్జాతీయ అవార్డుల రేసులో పోటీపడుతోంది. రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఈ ఏడాది మార్చిలో విడుదలై రూ.1800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడీ చిత్రం మ్యూజిక్ ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల రేసుకు రెడీ అయింది. 2027 గ్రామీ అవార్డుల కోసం మొత్తం తొమ్మిది విభాగాల్లో పరిశీలనకు పంపినట్టు చిత్ర నిర్మాణ సంస్థ ‘బీ62’ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది.
మొత్తం ఆల్బమ్‌తో పాటు బెస్ట్ సాంగ్ రిటన్ ఫర్ విజువల్ మీడియా ‘ఫిర్ సే’, బెస్ట్ ర్యాప్: ‘డెస్టినీ–మన్ అట్కేయా’, బెస్ట్ ఏషియన్ పాప్: ‘ఆరీ ఆరీ’, బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్: ‘జాన్ సే గుజర్‌తే’, బెస్ట్ పాప్ డ్యుయో/గ్రూప్: ‘జైయే సజనా’, బెస్ట్ రీమిక్స్‌డ్ రికార్డింగ్: ‘హమ్ ప్యార్ కర్నే వాలే’, బెస్ట్ డ్యాన్స్/ ఎలక్ట్రానిక్ రికార్డింగ్: ‘వారీ జావాన్’ను పోటీ కోసం పంపించారు. జనవరిలో 69వ గ్రామీ అవార్డులకు సంబంధించిన నామినేషన్స్‌పై క్లారిటీ రానుండగా, ఫిబ్రవరి తొలివారంలో అవార్డుల వేడుక జరుగనుంది. మరి ‘ధురంధర్ 2’ చిత్రం ఎన్ని విభాగాల్లో ఎంపిక అవుతుందో చూడాలి!
