ఈ నెల చివర గ్రేటర్​లో డయాగ్నస్టిక్ హబ్స్‌‌‌‌  ప్రారంభం

ఈ నెల చివర గ్రేటర్​లో డయాగ్నస్టిక్ హబ్స్‌‌‌‌  ప్రారంభం
ఈ నెలాఖరు నుంచి 8 సెంటర్లు ప్రారంభింస్తాం: మంత్రి ఈటల హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌లో ఏర్పాటు చేసిన 8 మినీ డయాగ్నస్టిక్ హబ్స్‌‌‌‌ను ఈ నెలాఖరులో ప్రారంభించినున్నట్టు మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కలిసి వీటిని ఏర్పాటు చేశాయి. ఈ సెంటర్లలో రక్త, మూత్ర పరీక్షలతో పాటు, ఎక్స్‌‌‌‌రే, ఆల్ర్టాసౌండ్, ఈసీజీ వంటి అన్ని రకాల స్కానింగ్‌‌‌‌లు చేయనున్నారు. హైదరాబాద్‌‌‌‌లోని అర్బన్‌‌‌‌ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, అర్బన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖాన్లలో డయాగ్నసిస్‌‌‌‌ సేవలు అందుబాటులో లేవు. కొత్తగా ఏర్పాటు చేయబోయే డయాగ్నసిస్ సెంటర్లను ఈ దవాఖాన్లకు అనుసంధానించి, అక్కడి డాక్టర్లు రెఫర్ చేసిన వారికే ఫ్రీగా టెస్టులు చేయనున్నారు. గతంలో తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ పేరిట నారాయణగూడ ఐపీఎం ఆవరణలో ఓ సెంటర్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ కేవలం రక్త, మూత్ర పరీక్షలే చేస్తున్నారు. స్కానింగ్‌‌‌‌లు చేయడం లేదు. కొత్త సెంటర్లలో అన్ని రకాల స్కానింగ్‌‌‌‌లు కూడా చేయాలని నిర్ణయించారు. సెంటర్ల ఏర్పాటు, నిర్వాహణ కోసం కేంద్రం60 శాతం, రాష్ర్ట సర్కార్ 40 శాతం నిధులు భరిస్తోంది. హైదరాబాద్‌‌‌‌లో 16 సెంటర్లు, జిల్లాల్లో 20 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు కొత్తగా 11 సీటీ స్కాన్, 3 ఎంఆర్‌‌‌‌‌‌‌‌ఐ యంత్రాలు కొనుగోలు చేయాలని ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా వీటిని అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. For More News.. దమ్ముంటే.. పాత బస్తీని 15 నిమిషాలు పోలీసులకు అప్పగించు ఇండియన్ బాస్కెట్‌బాల్ ప్లేయర్‌పై రెండేళ్ల బ్యాన్‌‌