పవన్‌‌‌‌ కోసం హరీష్ ప్లాన్

పవన్‌‌‌‌ కోసం హరీష్ ప్లాన్

స్టార్ హీరో సినిమాలపై అభిమానుల దృష్టి ప్రతిక్షణం ఉంటుంది. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎప్పుడు సెట్స్‌‌‌‌కి వెళ్తుంది, ఎప్పుడు ఏ అప్‌‌‌‌డేట్ వస్తుంది, సినిమా ఎప్పుడు తమ ముందుకొస్తుంది అంటూ ఎన్నో లెక్కలు, ఎదురు చూపులు మొదలవుతాయి. ప్రాజెక్ట్ కాస్త ఆలస్యమైనా రకరకాల అనుమానాలు కూడా వచ్చేస్తాయి. పవన్‌‌‌‌ కళ్యాణ్‌‌‌‌, హరీష్ శంకర్‌‌‌‌‌‌‌‌ల సినిమా విషయంలోనూ ఇదే జరుగుతోంది. వీరి కాంబినేషన్‌‌‌‌లో ‘భవదీయుడు భగత్‌‌‌‌సింగ్’ చిత్రాన్ని అనౌన్స్ చేసి చాలా కాలమైంది. కానీ ఇప్పటికీ సినిమా పట్టాలెక్కలేదు. పైగా పవన్‌‌‌‌ లిస్టులో వేరే ప్రాజెక్టులు యాడ్ అవుతూ పోతున్నాయి. దాంతో అసలు ఈ సినిమా ఉంటుందా ఉండదా అనే టెన్షన్‌‌‌‌తో ఫ్యాన్స్‌‌‌‌కి నిద్ర పట్టడం లేదు. 

‘గబ్బర్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌’లో పవన్‌‌‌‌ని ఓ రేంజ్‌‌‌‌లో ఎలివేట్ చేశాడు హరీష్. అందుకే ఈ కాంబోపై వాళ్లు చాలా ఆశలు పెట్టుకున్నారు. అదే విషయాన్ని ఇటీవల ట్విటర్‌‌‌‌‌‌‌‌లో హరీష్‌‌‌‌తో చెప్పాడు ఒక అభిమాని. ఆ స్టెప్స్, ఆ స్టైల్, ఆ స్వాగ్‌‌‌‌ మళ్లీ చూడటానికి మీ సినిమా కోసం ఎదురు చూస్తున్నామని అనడంతో హరీష్ రియాక్టయ్యాడు. ‘అన్నీ ఉంటాయి.. ఏదీ మిస్సవదు. నన్ను నమ్మండి. ఈ ఎదురుచూపులకు కచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది’ అని చెప్పాడు హరీష్. దాంతో సినిమా విషయంలో క్లారిటీ వచ్చినట్టయ్యింది. పవన్‌‌‌‌ కోసం హరీష్ ఏదో పెద్దగానే ప్లాన్ చేశాడనిపిస్తోంది.