డాక్టర్ల నిర్వాకం.. కుడి చేతికి బదులుగా ఎడమ చేతికి ఆపరేషన్

డాక్టర్ల నిర్వాకం..  కుడి చేతికి బదులుగా ఎడమ చేతికి ఆపరేషన్
  • అదనపు వేలు తొలగింపు కోసం ఆస్పత్రిలో చేరిన బాలుడు
  • విచారణకు ఆదేశించిన అధికారులు
  • మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఘటన

ముంబై: మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా పండరీపురంలో ఓ డాక్టర్ నిర్లక్యం భయటపడింది. ఆసుపత్రిలో చేరిన ఆరేళ్ల బాలుడి కుడి చేతికి బదులుగా ఎడమ చేతికి ఆపరే షన్ చేశారని బాధితులు ఆందోళనకు దిగారు. బాలుడికి కుడి చేతి అదనపు వేలు వల్ల నొప్పి కారణంగా పట్టుకో వడం సమస్యగా మారింది. దీంతో ఆ వేలు తొలగించా డానికి ఆస్పత్రిలో బాలుడు చేరాడు. ఆపరేషన్ ముగిసిన తర్వాత చూస్తే.. వైద్యులు కుడి చేతికి బదులుగా ఎడమ చేతి వేలును తొలగించారని కుటుంబ సభ్యులు గుర్తిం చారు. దీనిపై నిలదీయగా, ఎడమ చేతికి కూడా అదనపు వేలు ఉంది కదా. ఈరోజు కాకపోతే రేపైనా తీయాల్సిందే అని వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాలుడి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఒప్పంద పత్రాల్లో కుడి చేయి అని స్పష్టంగా ఉన్నప్పటికీ, రికార్డులను మార్చే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరో పించారు. అయితే ఈ ఘటనపై అధికారులు స్పందించి విచారణకు ఆదేశించారు.