
నారప్ప వంటి సూపర్ హిట్ తరువాత డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల(Srikanth Addala) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీకీ "పెద కాపు1(peda kapu). రూరల్ అండ్ పొలిటికల్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీతో విరాట్ కర్ణ(Virat karna) హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. కాగా ఈ మూవీ నుంచి ప్రేక్షకుల్లో ఇంటెన్సిటీని కలిగించే ఓ న్యూస్ వైరల్ అవుతుంది.
డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాలో కీలకమైన రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ లో తన నుంచి జస్ట్ లుక్ రివీల్ అవగా..ఇక త్వరలో రిలీజ్ అయ్యే ట్రైలర్ లో తనదైన గోదావరి స్లాంగ్ లో డైలాగ్స్ వినిపిస్తారని టాక్. శ్రీకాంత్ అడ్డాల ప్లే చేసే రోల్ ఈ సినిమాకే హైలెట్ గా ఉంటుందంటూ యూనిట్ వర్గాల నుంచి సమాచారం.
ఇప్పటికే రిలీజైన టీజర్ ఆడియన్స్ లో మాసివ్ బజ్ క్రియేట్ చేసింది. ఇక త్వరలో రిలీజ్ అయ్యే ట్రైలర్ తో మరింత హైప్ క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నమెలోడీ మిక్కీ జే మేయర్.. భీకరమైన మ్యూజిక్ అందించాడని టీజర్ ను చూస్తుంటే తెలుస్తుంది. ఇక రెండు భాగాలుగా ఈ మూవీని డైరెక్టర్ తెరకెక్కిస్తున్నారు.
ALSOREAD:మెగా మాస్157 అప్డేట్.. గెట్ రెడీ ఫ్యాన్స్
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీని తీసిన డైరెక్టర్ నుంచి..పేద కాపు వంటి అగ్రెస్సివ్ మాస్ ఫిలిం వస్తుందంటే..చాలా కొత్త ఫీలింగ్ కలిగేలా ఉందంటూ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
నాగబాబు(Nagababu), తనికెళ్ల భరణి, రావు రమేశ్(Rao Ramesh), రాజీవ్ కనకాల(Rajeev kanakala), ఈశ్వరీ(Eshwari), అనసూయ(Anasuya) కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. నిర్మాత, మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 29 న రిలీజ్ కాబోతుంది.