మెగా మాస్157 అప్డేట్.. గెట్ రెడీ ఫ్యాన్స్

మెగా మాస్157 అప్డేట్.. గెట్ రెడీ ఫ్యాన్స్

మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi)మెగా157 మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌(UV Creations) నిర్మిస్తుండగా.. బింబిసార(Bimbisara) ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ(Mallidi Vasishta) తెరకెక్కించనున్నాడు.

లేటెస్ట్ గా ఈ మూవీ ప్రీ-ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయినట్లు మేకర్స్ ప్రకటించారు. విశ్వానికి మించిన మెగా మాస్ కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి..అంటూ యూవీ క్రియేషన్స్‌ ట్వీట్ చేసింది. ఈ మూవీలో చిరుకి జోడీగా ఇద్దరు స్టార్ హీరోయిన్స్ అనుష్క లేదా నయనతారను తీసుకోనున్నట్లు సమాచారం. కాగా ఈ మూవీని ఆగస్టు 22 చిరంజీవి పుట్టిన రోజు సంధర్బంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన విషయం తెలిసిందే. 

పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ తో రానున్న ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. పంచభూతాలతో కూడిన సోషియో ఫాంటసీ స్టోరీతో పోస్టర్ ను అద్భుతంగా క్రియేట్ చేశారు మేకర్స్. మెగామాస్ బియాండ్ యూనివర్స్ అంటూ పోస్టర్ పై ఇచ్చిన క్యాప్షన్ నెక్స్ట్ లెవల్లో ఉంది. ఈ ఒక్క పోస్టర్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు డైరెక్టర్.

ALSOREAD:ప్రభాస్ స్పిరిట్ నుంచి.. మత్తెక్కించే స్టోరీ వైరల్!

ఇవన్నీ చూస్తుంటే..మెగాస్టార్ కోసం దర్శకుడు ఎదో గట్టిగానే ప్లాన్ చేశారు అనేది క్లియర్ గా అర్థమౌతోంది. ఇక ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం ఆడించునున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే మొదలుకానుంది. ఇక ఈ సినిమాకు పనిచేయనున్న కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.