హైదరాబాద్, వెలుగు: ఏఐ, సైబర్ భద్రత, డేటా రక్షణ అంశాలపై చర్చ కోసం సీఐఐ హైదరాబాద్లో బుధవారం చర్చ నిర్వహించింది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో నమ్మకం అనేది అత్యంత కీలకమైన అంశమని సీఐఐ తెలంగాణ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. సంస్థలు కృత్రిమ మేధను వేగంగా అందిపుచ్చుకుంటున్నాయని, అయితే భద్రత, పారదర్శకత కూడా అదే స్థాయిలో పెరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి పరిశ్రమల మధ్య సహకారం అవసరమని గౌతమ్ పేర్కొన్నారు.

