జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో విభేదాలు

జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో విభేదాలు

జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ నూతన పాలక మండలిలో విబేధాలు మొదలయ్యాయి. సభ్యులు బాహాబాహీకి దిగడంతో విబేధాలు రచ్చకెక్కాయి. సొసైటీ ప్రెసిడెంట్ మరియు సభ్యులపై.. సొసైటీ సెక్రటరీ మురళీ ముకుంద్ పోలీసులుకు కంప్లైంట్ ఇచ్చాడు. సొసైటీ బై లాస్ ప్రకారం.. సెక్రటరీ అయిన తాను రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నానని ఆయన తెలిపారు. ఎప్పుడు ఎవరికి ఏ రికార్డు అవసరమొచ్చినా.. సెక్రటరీ సమక్షంలో రికార్డు చూడటానికి సభ్యులకు  అధికారం ఉందని ఆయన తెలిపారు. కానీ, నిబంధనలకు విరుద్ధంగా.. రికార్డు రూమ్ తాళాలు ఇవ్వాల్సిందిగా సొసైటీ ప్రెసిడెంట్ మరియు ఇతర సభ్యులు తనను రెండు గంటల పాటు నిర్భంధించి.. తనపై దౌర్జన్యం చేశారని పోలీసులతో పాటు సహకార సంఘాల రిజిస్ట్రార్ కు ఫిర్యాదు చేశారు. పాలక మండలి ఎన్నికైన కొద్ది నెలల్లోనే ఇలాంటి గొడవలతో సొసైటీని అధ్యక్షుడు భ్రష్టు పట్టిస్తున్నాడని సభ్యులు చర్చించుకుంటున్నారు.