చిక్కుల్లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ .. విమానాల రద్దుపై ప్రభుత్వం సీరియస్

చిక్కుల్లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ .. విమానాల రద్దుపై ప్రభుత్వం సీరియస్

ఎయిర్ ఇండియా ఎక్సప్రెస్ సంస్థ చిక్కుల్లో పడింది. యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ క్యాబిన్ క్రూ విధులకు గైర్హాజరవ్వటంతో ఎయిర్ ఇండియా మంగళవారం నుండి 90విమాన సర్వీసులను రద్దు చేసింది. దీనిపై పౌర విమానయాన శాఖ సీరియస్ అయ్యింది. విమానాల రద్దుకు గల కారణాల గురించి ఎయిర్ ఇండియాను వివరణ కోరింది. ఈ ఘటనకు కారణమైన పొరపాట్లను గుర్తించి వెంటనే సరి చేసుకోవాలని, డీజీసీఏ రూల్స్ ప్రకారం ప్రయాణికులకు సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది.

అసలే, విమానయాన రంగం కరోనా సృష్టించిన సంక్షోభం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో ఉద్యోగులు నిరసనకు దిగటం ఎయిర్ ఇండియా సంస్థకు గట్టి షాక్ అనే చెప్పాలి. మరి, ఈ సంక్షోభం నుండి ఎయిర్ ఇండియా ఎలా బయటపడుతుంది అన్నది వేచి చూడాలి.