అదాని, అంబానీ జపం బంద్.. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే కాంగ్రెస్ తీరు మారింది : మోదీ

అదాని, అంబానీ జపం బంద్.. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే కాంగ్రెస్ తీరు మారింది : మోదీ
  •  ఎందుకు విమర్శిస్తలేరో వాళ్లే జవాబు చెప్పాలె
  •  ట్రిపుల్ ఆర్ సినిమా కలెక్షన్లను దాటిన డబుల్ ఆర్ అవినీతి 
  •   తెలంగాణను లూటీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
  •  అవినీతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటే
  •  గతంలో ఓటుకు నోటు కేసును తొక్కిపెట్టిన బీఆర్ఎస్ సర్కారు
  •  కాళేశ్వరం అవినీతిపై యాక్షన్ లోకి దిగని కాంగ్రెస్ ప్రభుత్వం
  •  బడుగుల రిజర్వేషన్లన్నీ ముస్లింలకే ఇచ్చేందుకు కాంగ్రెస్ కుట్ర
  •  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో సాఫ్ చేద్దాం
  •  కరీంనగర్ లో  బండి సంజయ్ విజయం ఎప్పుడో ఖరారైంది
  •  వేములవాడ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
  •   రాజన్నను దర్శించుకొని కోడె మొక్కు సమర్పించిన ప్రధాని

వేములవాడ/హైదరాబాద్: ఎన్నికల  నోటిఫికేషన్ కన్నా ముందు అదాని, అంబానీ జపం చేసిన కాంగ్రెస్ నేతలు సడన్ గా బంద్ చేశారని, దాని వెనుక ఏం జరిగిందో వారే సమాధానం చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. ఎన్ని టెంపోల్లో డబ్బులు నింపుకొని పోయారు..? రాత్రికి రాత్రి ఎంత ముట్టజెప్పారు..? ఎందుకు అంబానీ, అదానిని తిట్టడం లేదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని, ఒకరిని ఒకరు కాపాడుకుంటారని మోదీ అన్నారు. రాష్ట్రంలో డబుల్ ఆర్ ట్యాక్స్ భారీ మొత్తంలఓ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. 

ఒక ఆర్ ఇక్కడ కలెక్షన్ చేస్తుందని, మరో ఆర్ ఢిల్లీలో ఉండి తీసుకుంటుందని విమర్శించారు. వీళ్ల కలెక్షన్ కొద్ది  రోజుల్లోనే ట్రిపుల్ ఆర్ సినిమా కలెక్షన్ ను దాటేసిందని అన్నారు. ఇవాళ వేములవాడలో ప్రధాన మంత్రి రాజరాజేశ్వరస్వామిని దర్శించుకొని కోడె మొక్కును తీర్చుకున్నారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులూ ఓటుకు నోటు కేసును తొక్కిపెట్టిందని, అధికారంలోకి రాకముందు కాళేశ్వరం అవినీతిపై హడావిడి చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు ఆ కేసులో యాక్షన్ లోకి దిగడం లేదని అన్నారు.

 బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు అవినీతి మయమైన కుటుంబ పార్టీలని మోదీ ఫైర్ అయ్యారు. తెలంగాణ డబుల్ ఆర్ నుంచి విముక్తి కావాల్సి ఉందని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ ను సాఫ్ చేస్తామని అన్నారు. హైదరాబాద్ లో ఈ రెండు పార్టీలు ఎంఐఎంను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఎంఐఎంకు మొదటి సారిగా బీజేపీ అభ్యర్థిని చూసి భయపడుతోందన్నారు. బీజేపీ జాతీయ వాద మూలాలున్న పార్టీ అని, బీజేపీ నినాదం నేషన్ ఫస్ట్ అని, బీఆరెఎస్, కాంగ్రెస్ స్లోగన్ ఫ్యామిలీ ఫస్ట్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లపై గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తోందని,  ఆ పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లన్నీముస్లింలకే ఇస్తుందని చెప్పారు.

 అంబేద్కర్ రాజ్యాంగాన్ని బీజేపీ గౌరవిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. అయోధ్యలో రామమందిరం నిర్మించడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదన్నారు. అయినా ఓ దీక్షతో రామమందిరాన్ని నిర్మించామని, భవ్యమైన రామమందిరానికి తలుపులను అందించిన ఘనత తెలంగాణకే దక్కిందని చెప్పారు. ఈ దేశంలోని ప్రతి పౌరుడు అయోధ్యలోని రామ మందిరాన్ని దర్శించుకోవాలని కోరారు. 

పీవీని అవమానించిన కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ ఓ గొప్ప రాజనీతిజ్ఞడు, ఆర్థిక వేత్త అయిన మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావును అవమానించింది. ఆయన పార్థివ దేహాన్ని పార్టీ ఆఫీసులోకి తీసుకురానివ్వలేదని, బయటికి నెట్టేసిందని విమర్శించారు. పీవీకి భారత రత్న ఇచ్చి గౌరవించిన ఘనత ఎన్డీఏ సర్కారుకే దక్కిందని చెప్పారు. నిన్న తాను హైదరాబాద్ లో పీవీ కుటుంబ సభ్యులను కలుసుకున్నానని, ఆయన జ్ఞాపకాలను వారు వివరించారని, పీవీ కుటుంబంలోని మూడు తరాలతో ముచ్చటించే భాగ్యం తనకు దక్కిందని అన్నారు. వారు అనేక అనుభవాలను తనతో పంచుకున్నారని చెప్పారు. 

గుజరాత్ లోనూ ఇంత మంది రాలె

ఉదయం 10 గంటలకు సభ నిర్వహిస్తే ఇంత పెద్ద ఎత్తున జనం తరలిరావడం గొప్ప విషయమని అన్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశానని, అక్కడ కూడా ఉదయం సభ నిర్వహిస్తే ఎంత పెద్ద సంఖ్యలో జనం రాలేదని చెప్పారు. బండి సంజయ్ విజయం ఎప్పుడో ఫిక్స్ అయ్యిందని చెప్పారు. గత ప్రభుత్వం ఆర్థిక రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందని, తాము ప్రపంచంలో ఐదో ఆర్థికశక్తిగా తీర్చిదిద్దామని మోదీ చెప్పారు.

 ‘కాంగ్రెస్ ను తెలంగాణలో  సాఫ్ చేద్దామా.. రామ మందిరాన్ని రక్షించుకునేందుకు కాంగ్రెస్ ను సాఫ్ చేద్దామా..? మే 13న కాంగ్రెస్, బీఆర్ఎస్ పాపాల లెక్కను తేల్చండి. కరీంనగర్ నుంచి బండి సంజయ్ కుమార్, ఆదిలాబాద్ నుంచి గోడం నగేశ్, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, కరీంనగర్ నుంచి బండి సంజయ్ ని గెలిపించండి.. వీళ్లకు మీరు వేసే ఓటు మోదీకి వేసినట్టే. వాళ్లు మోదీకి…