పాలు ఏ టైంలో తాగాలంటే?

పాలు ఏ టైంలో తాగాలంటే?

రోజూ ఉదయాన్నే పాలు తాగితే బలమొస్తుంది. బాడీకి పోషకాలు అందుతాయి అంటారు కొందరు. రాత్రిపూట తాగితే మంచి నిద్ర పడుతుంది అంటారు మరికొందరు. ఎవరెన్ని చెప్పినా పాలు ఏ టైంలో తాగాలో చాలామందికి కన్ఫ్యూజనే. కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది.

ఉదయం

ఇమ్యూనిటీ పెరగాలంటే, ఉదయం బ్రేక్​ఫాస్ట్​ చేసేటప్పుడు తాగాలి. అప్పుడే న్యూట్రియెంట్స్​అందుతాయి. పాలలో గుడ్​ ఫ్యాట్స్, ప్రొటీన్, విటమిన్–డి, మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం వంటివి​ ఉంటాయి. పాలు తాగడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. బీపీ నార్మల్​గా ఉంటుంది. పాలలో గుడ్​ ఫ్యాట్స్​ ఉండడం వల్ల వెయిట్​ లాస్​కు కూడా ఉపయోగ పడతాయి. అలా అని ఎక్కువ తాగితే బరువు పెరిగే అవకాశమూ ఉంది.

సాయంత్రం

రాత్రి పడుకునే ముందు పాలు తాగితే, పాలలో ఉండే ‘ట్రిప్టోఫాన్’​ అనే అమైనో యాసిడ్​ విడుదలై  నిద్ర పడుతుంది. నెర్వస్​ సిస్టమ్​ రిలాక్స్​ అవుతుంది. కానీ, ఆయుర్వేదం ప్రకారం..  పాలు సాయంత్రం పూట తాగాలి అంటారు. ఎందుకంటే ఆవు పాలు అరగటానికి చాలా టైం పడుతుంది. కాబట్టి పగలంతా అలసిపోయి సాయంత్రం వేళ బాడీ రిలాక్స్​ అవుతుంది. అప్పుడు పాలు తాగితే ఒంట్లో ఎనర్జీ వస్తుందని ఆ టైంలో తాగమంటారు. అదే పొద్దున పూట తాగితే బాడీ హెవీగా అనిపిస్తుందట. 
కానీ ఇప్పుడు చాలా వరకూ బర్రె పాలే తాగుతున్నారు కాబట్టి కాస్త చూసుకుని తాగితే మంచిది. చిక్కటిపాలు తాగితే అజీర్తి చేస్తే, ఆ పాలలో కాసిన్ని నీళ్లు కలిపి తాగొచ్చు. పాలు తాగడానికి పంచదారకి బదులు తేనె కలిపితే టేస్టిగా ఉంటాయి. ఎక్కువగా తాగడానికి ఇష్టపడతారు.