అమిత్ షాను ప్రధానిని చేసేందుకే మోదీ ఓట్లు అడుగుతున్నారు : కేజ్రీవాల్

అమిత్ షాను ప్రధానిని చేసేందుకే  మోదీ  ఓట్లు అడుగుతున్నారు : కేజ్రీవాల్

బీజేపీ మళ్లీ గెలిస్తే SC,ST రిజర్వేషన్లు రద్దు చేస్తోందన్నారు ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్.  పీఎం మోడీకి సెప్టెంబర్ 17, 2025 నాటికి 75 ఏళ్లు నిండుతాయని.. ప్రధాని మోదీ అమిత్ షాను తన రాజకీయ వారసుడిగా చేయాలని నిర్ణయించుకున్నారు.. అమిత్ షాను ప్రధానిని చేసేందుకే మళ్లీ బీజేపీని గెలిపించాలంటున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు.  

హర్యానా, ఢిల్లీ, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, యూపీ, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్‌లలో బీజేపీకి  సీట్లు తగ్గుతాయన్నారు కేజ్రీవాల్. బీజేపీ మళ్లీ గెలిస్తే రెండు మూడు నెలల్లో  యోగి ఆదిత్యనాథ్ ను యూపీ సీఎంగా ఆ పార్టీ తప్పిస్తుందని చెప్పారు.  

ఈ ఎన్నికల్లో బీజేపీకి 220 సీట్ల కంటే తక్కువ సీట్లు వస్తాయన్నారు  కేజ్రీవాల్. ఈ   విషయం బీజేపీ నేతలకు కూడా అర్థమైందన్నారు. లక్నోలో మీడియాతో మాట్లాడారు అఖిలేష్, కేజ్రీవాల్. జూన్ 4న ఇండియా కూటమి అధికారంలోకి వస్తోందని ధీమా వ్యక్తం చేశారు.