హైదరాబాద్ సిటీ, వెలుగు: నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రారంభించిన యువ ఆపద మిత్ర పథకంలో భాగంగా 78 మంది వలంటీర్లు హైడ్రాలో వారం రోజుల శిక్షణ పూర్తి చేసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, ఆపద వచ్చినప్పుడు తనను తాను రక్షించుకోవడంతో పాటు చుట్టుపక్కల వారిని ఎలా కాపాడాలో ఈ ట్రైనింగ్లో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వలంటీర్లకు ఫతుల్లాగూడ లోని ట్రైనింట్ సెంటర్ లో మంగళవారంహైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
అలాగే, నిజామాబాద్ లోని గిరిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ఎంపికైన 78 మందికి బుధవారం శిక్షణ ప్రారంభించారు. వారం రోజుల శిక్షణ పూర్తి కావడంతో హైడ్రా చీఫ్వారితో మాట్లాడారు. హైడ్రా అడిషనల్ డైరక్టర్ వర్ల పాపయ్య , అడిషనల్ కమిషనర్ ఆర్ సుదర్శన్, ఆర్ ఎఫ్ వో జయప్రకాష్ తదితరలు పాల్గొన్నారు.
