-
కాంగ్రెస్‌కు రూ.522 కోట్లు మాత్రమే
బీజేపీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 6,088 కోట్ల రాజకీయ డొనేషన్లు సేకరించింది. ఇది కాంగ్రెస్ పార్టీ సేకరించిన రూ. 522 కోట్ల కంటే దాదాపు 12 రెట్లు ఎక్కువ. రాజకీయ డోనేషన్లలో 85% బీజేపీకే వచ్చాయి.
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీం కోర్టు 2024 ఫిబ్రవరిలో రద్దు చేసిన తర్వాత మొదటి పూర్తి ఆర్థిక సంవత్సరం (2024–25)లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రూ. 6,088 కోట్ల రాజకీయ డొనేషన్లు సేకరించింది. ఇది కాంగ్రెస్ పార్టీ సేకరించిన రూ. 522 కోట్ల కంటే దాదాపు 12 రెట్లు ఎక్కువ. ఎన్నికల సంఘం (ఈసీఐ) డేటా ప్రకారం, మునుపటి ఏడాది (2023–24)లో బీజేపీ రూ.3,967 కోట్లు, కాంగ్రెస్ రూ. 1,130 కోట్లు సేకరించాయి.
ఈ ఫండింగ్ ముఖ్యంగా ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా వచ్చింది, ఎందుకంటే ఎలక్టోరల్ బాండ్లు అనామక డొనేషన్లను అనుమతించేవి కానీ సుప్రీంకోర్టు తీర్పుతో రద్దయ్యాయి. 19 రిజిస్టర్డ్ ఎలక్టోరల్ ట్రస్టులలో 13 ట్రస్టులు 2024–25కు తమ కంట్రిబ్యూషన్ రిపోర్టులను ఈసీఐకి సబ్మిట్ చేశాయి. మొత్తం ట్రస్టుల ద్వారా వచ్చిన ఫండింగ్‌లో బీజేపీ 85% వాటా సాధించింది. గతేడాది(2023–24)లో ఆ పార్టీ వాటా 56% మాత్రమే. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు, ఇందులో 2024 లోక్‌సభ ఎన్నికలు కూడా ఉన్నాయి.
20 వేల రూపాయలకు మించి వచ్చిన డొనేషన్ల వివరాలు ఈసీఐకి వెల్లడించాలి. వచ్చిన నిధుల్లో కనీసం 95% అదే ఆర్థిక సంవత్సరంలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. అన్ని రిజిస్టర్డ్ పార్టీలు రెప్రెజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ ఆక్ట్, 1951 మరియు ఇన్‌కమ్ టాక్స్ ఆక్ట్, 1961 ప్రకారం ఆడిట్ మరియు కంట్రిబ్యూషన్ రిపోర్టులు ఈసీఐకి సబ్మిట్ చేయాలి. కంపెనీలు మరియు వ్యక్తులు డొనేషన్లపై ఇన్‌కమ్ టాక్స్ ఆక్ట్ సెక్షన్ 80 జీజీబీ కింద 100% డిడక్షన్ క్లెయిమ్ చేయవచ్చు.
