PEDDI: ఢిల్లీ తెలంగాణ భవన్లో పెద్ది సినిమా షూటింగ్.. బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్ అదుర్స్!

PEDDI: ఢిల్లీ తెలంగాణ భవన్లో పెద్ది సినిమా షూటింగ్.. బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్ అదుర్స్!
  • రామ్ చరణ్​ను చూసేందుకు తరలివచ్చిన ఫ్యాన్స్‌

న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో పెద్ది సినిమా షూటింగ్  జరిగింది. షూటింగ్  షెడ్యూల్‌లో భాగంగా మంగళవారం సాయంత్రం ఇక్కడి క్యాంటీన్‌లో సినిమాకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా ఆ సినిమా హీరో, నటుడు రామ్ చరణ్  తెలంగాణ భవన్ లో సందడి చేశారు. 

కొరియోగ్రాఫర్‌  జానీతో కలిసి రామ్‌చరణ్‌  తెలంగాణ భవన్‌కు వచ్చారు. ఆయనను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారిని అదుపు చేసేందుకు ఏపీ, తెలంగాణ సహా ఢిల్లీ పోలీసులు భారీగా మోహరించారు. చిత్ర యూనిట్‌ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్, జామా మసీదు, ఎర్రకోట వంటి చారిత్రక ప్రదేశాల్లో సన్నివేశాలను షూట్‌ చేసింది.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన తొలి పాట 'చికిరి చికిరి' ప్రపంచవ్యాప్తంగా 110 మిలియన్ల వ్యూస్ మార్క్‌ను దాటి, అనూహ్యమైన స్పందనతో ఈ సంవత్సరపు బిగ్గెస్ట్ చార్ట్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ పాట గ్లోబల్‌గా ట్రెండింగ్‌లో ఉంది. ఈ సాంగ్ తో మరింత అంచాలను పెంచింది.

'పెద్ది' చిత్రానికి ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండగా, కెమెరాను ఆర్. రత్నవేలు, ఎడిటింగ్‌ను జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం మార్చి 27, 2026న గ్రాండ్‌గా పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.